Astrologer Venu Swamy | జాతకాలు చెప్పే వేణు స్వామికి ఇంత అందమైన అమ్మాయి ప్రేమలో ఎలా పడిందో తెలుసా..

allroudadda

Astrologer Venu Swamy | సోషల్ మీడియా లో స్టార్ సెలెబ్రిటీల జాతకాలపై ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, నిత్యం ట్రెండింగ్ లో ఉండే వ్యక్తులలో ఒకడు వేణు గోపాల స్వామి. గతం లో ఇతనొక దొంగ స్వామిజి అని బాబు గోగినేని అనే వ్యక్తి ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో నిరూపించాడు. ఆ సంఘటన తర్వాత ఇతన్ని ఎవ్వరూ నమ్మరేమో అని అనుకున్నాం. కానీ చీకట్లో బాణం వదిలినట్టు,ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ విషయం లో ఇతని చెప్పినవి జరిగాయి.

అప్పటి నుండి ప్రతీ స్టార్ సెలబ్రిటీ విషయం లో నోరు పారేసుకోవడం ఇతనికి అలవాటు అయిపోయింది. ఇతని నోటి నుండి శుభప్రదమైన మాటలు ఒక్కసారి కూడా రాలేదు. అప్పుడే పుట్టిన రామ్ చరణ్ బిడ్డ మీద కూడా ఇతను ఆమెలో లోపాలు ఉన్నాయి అంటూ కామెంట్ చేసాడంటే, పాపులారిటీ పిచ్చి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఆ సంగతి పక్కన పెడితే వేణుస్వామి లవ్‌ స్టోరీ విషయం వైరల్‌ అవుతోంది.

Astrologer Venu Swamy | ఇంట్లో వారిని ఒప్పించి పెండ్లి..

allroudadda
allroudadda

Astrologer Venu Swamy | వేణుస్వామి వీణ శ్రీవాణిని ప్రేమించి పెండ్లి చేసుకున్నారు.శ్రీవాణి ఆర్ఆర్‌బీ బోర్డు ఎగ్జామ్‌లో స్టేట్ ర్యాంకర్‌. అయితే ఆమె ట్రైనింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. ఆ సమయంలో తన ఖర్చుల కోసం ఆమె వీణ నేర్పించడం స్టార్ట్ చేసింది. కాగా వేణుస్వామి కజిన్‌ కూతురు శ్రీవాణి దగ్గర వీణ నేర్చుకోవడానికి వెళ్లేది.

ఆ పాపను దింపడానికి వెళ్లిన వేణుస్వామి శ్రీవాణిని చూసి మనసు పడ్డారు.కొన్ని రోజులు ఆమెతో పరిచయం పెంచుకుని ఆమెకు ప్రపోజ్ చేశారు. చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని పట్టుబట్టారు. ఆమె కూడా వేణుస్వామి ప్రేమను అంగీకరించింది. ఇంట్లో వారిని ఒప్పించి వేణుస్వామి పెండ్లి చేసుకున్నారు. కానీ శ్రీవాణి ఇంట్లో వారు మాత్రం దూరం అయ్యారు. కానీ తన భర్త ఆ ప్లేస్‌ ను రీప్లేస్ చేశారని చెప్పుకొచ్చింది శ్రీవాణి.

Leave a Reply