Venu Swamy | త్వరలో ఆ పార్టీ అంతమవుతుంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!

allroudadda

Venu Swamy | 2024 ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేసే దశగా అడుగులు వేస్తున్నారు. విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ జనసైనికుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే సొంత పార్టీని స్థాపించినప్పటికీ ఇప్పటివరకూ ఒంటిరిగా పోటీ చేసింది లేదు. టీడీపీ, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, సీపీఎం-సీపీఐ ఇలా వివిధ పార్టీలతో పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవి చూశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఇక జనసేన తరుపున పోటీ చేసిన గెలిచిన ఒకే ఒక్క సీటు.. రాజోలు (రాపాక వరప్రసాద్)ని నిలుపుకోలేకపోయారు.

ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా జంపింగ్ జపాంగ్‌ల జాబితాలో చేరిపోయారు.అయితే నష్టనివారణ చర్యలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. బీజేపీ పొత్తుతో 2024 ఎన్నికల్లో సీఎం కుర్చీ ఎక్కడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.అయితే తాజాగా వేణు స్వామి మాట్లాడుతూ.. 2024లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒకదానిపై నిలకడగా ఉండరని, అదే అందుకు కారణం అని ఆయన చెప్పుకొచ్చారు.

allroudadda
allroudadda

2024 లో జనసేన పార్టీ ఉండదని వేణు స్వామి బలగుద్దినట్లు చెప్పారు.సినిమాల పరంగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉందని, ఆయన ఏదైనా సభ పెడితే అక్కడికి లక్షలాది అభిమానులు చేరుకుంటారు. వారంతా ఓట్లు వేస్తారని అనుకుంటాం కానీ ఒక్కరు కూడా ఓటు వేయరు అని, అభిమానం వేరు ఓటు వేయటం వేరు. ఆయనే కాదు సెలబ్రిటీలు ఎవరికి ఓట్లు వేయరు. ఒక్క నందమూరి తారక రామారావు తప్ప ఎవరు రాజకీయాలలో సక్సెస్ కాలేదు.

శివరాత్రికి ఇలా పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట..

యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన బర్రెలక్క అలియాస్ శిరీష కు జనాలు చప్పట్లు కొడతారు తప్ప ఆమెకు ఓటు వేయరు, గెలిపించరు. హీరో పై ఎంత అభిమానం ఉన్న రాజకీయాలలోకి వచ్చేసరికి ఓటు వేయడానికి ఆలోచిస్తారు. అదే సినిమాలలో అయితే ఆయనను చప్పట్లు కొట్టి ఆరాధిస్తారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే. ఆయనకు ఎంత అభిమానం ఉన్న రాజకీయాలలో మాత్రం నెగ్గలేరు అని అన్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ 17 సంవత్సరాలు సీఎం గా చేస్తారని, 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ దే విజయం అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే వేణు స్వామి చెప్పినట్లుగానే 2024 లో జనసేన పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందా అంటే చూడాల్సి ఉంది.

Leave a Reply