allroudadda

Thalapathy Vijay | కొత్త రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్.. ఇంకా సీయం సీటు కాళీ చెయ్యండి..

Thalapathy Vijay | విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్ర శేఖర్. తమిళనాటే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ స్టార్ చేసిన విజయ్.. నాలియ తీర్పు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. అనతి కాలంలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. నన్బన్ (తెలుగులో స్నేహితుడు) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ స్టార్ నటుడికి..

తెలుగు నాట కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తుపాకీ, జిల్లా, కత్తి, పులి, తేరీ (పోలీసోడు), మెర్సల్ (అదిరింది), బిగిల్, మాస్టర్, బీట్స్ మూవీలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పాగా వేశాడు. తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు తన పార్టీ పేరును కూడా ప్రకటిస్తూ ఓ లెటర్‌ను విడుదల చేశారు. టీవీకే విజయ్ పేరిట ఓ పార్టీని స్థాపించారు.

allroudadda
allroudadda

ఈ పార్టీ పూర్తి పేరు “తమిళక వెట్రి కజగం”. ఈ పార్టీ 2024 పార్లమెంటు ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వదు, పోటీ చేయదట. 2026 తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా వస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవల వరుసగా సామాజిక కార్యక్రమాలు చేయడంతో పాటు తన సేవా సంస్థ విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో సమావేశం నిర్వహించడంతో దాదాపుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి.

Leave a Reply