విజయ్ దేవరకొండ – రష్మికల ఎంగేజ్ మెంట్? సెటైర్ వేస్తూ ఫైర్ అయిన రష్మిక

‘గీతా గోవిందం’ సినిమాతో హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మొదటి సారి కలిసి నటించారు. ఆ సినిమా భారీ విజయం సాధించి వారిద్దరూ మంచి పెయిర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కలిసి నటించారు. ఈ రెండు సినిమాల్లో రొమాన్స్ కొంచెం ఎక్కువే ఉంది. ఈ సినిమాలతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.ఆ తర్వాత నుంచి విజయ్, రష్మికలు కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

వీరిద్దరూ కలిసి పార్టీలు, డిన్నర్లకు హాజరవుతున్నారు. రష్మిక విజయ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి ఫెస్టివల్స్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు కూడా. ముంబైలో చక్కర్లు కొడుతూ అక్కడి కెమెరాలకు చాలా సార్లు చిక్కారు. దీంతో బాలీవుడ్ మీడియా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, డేటింగ్ లో ఉన్నారని వార్తలు రాశారు.

తాజాగా ఓ వెబ్ సైట్ ఏకంగా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రాసింది. ఈ న్యూస్ విజయ్ దాకా వెళ్ళింది. దీంతో సీరియస్ అయిన విజయ్ ఈ న్యూస్ పై..”ఎప్పటిలాగే నాన్సెన్స్. చెత్త వార్తలు” అంటూ సెటైరికల్ గా ఆ న్యూస్ రాసిన వారిపై ఫైర్ అయ్యాడు.

గతంలో కూడా విజయ్ ఇలాంటి ఫేక్ న్యూస్ లపై ఇలాగే సీరియస్ గానే స్పందించాడు.అలాగే రష్మిక కూడా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే మా మద్య ఏమి లేదు అంటూ చెప్పకొచ్చింది,

Leave a Reply