allroudadda

Vijayakanth | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… స్టార్ హీరో కన్నుమూత..

Vijayakanth | సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కోలీవుడ్ స్టార్ హీరో కెప్టెన్ విజయ్‌కాంత్‌ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్ ఈ రోజు కన్నుమూశారు.విజయ్ కాంత్ మరణంతో సినీ లోకం మూగబోయింది. నటుడిగా ఎన్నో అద్భుతమైన ల్లో నటించి మెప్పించారు విజయ్ కాంత్. తమిళనాడు రూరల్‌లో అత్యధిక ఫ్యాన్‌ బేస్‌ ఉన్న విజయ్‌కాంత్‌ మరణంతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఆయన నటించిన 100వ కెప్టెన్‌. కెప్టెన్‌ ప్రభాకరన్‌ తర్వాత అందరితో కెప్టెన్‌గా పిలిపించుకున్నారు విజయ్ కాంత్.విజయ్ కాంత్ మరణంతో కోలీవుడ్ విషాదంలో నిండిపోయింది. సినీ సెలబ్రెటీలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. మొదట డయాబెటిస్‌ కారణంగా ఆయన కుడి కాలి వేళ్లలో మూడింటిని డాక్టర్లు తొలగించారు. 2020లో ఆయన తొలిసారి కరోనా బారినపడ్డారు. అప్పటి నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు.

allroudadda
allroudadda

Vijayakanth | వైద్య పరీక్షల్లో ఆయనుకు కరోనా..

Vijayakanth | 2021లో ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం దుబాయ్‌ తరలించారు. కనీసం నిలబడలేకపోయారని, మాట్లాడే సామర్ధ్యం కూడా తగ్గిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.ఈ ఏడాది నవంబర్‌ 18న దగ్గు, సర్ది, గొంతునొప్పి కారణంగా చెన్నైలోని మియోటి దవాఖానలో చేరారు. జలుబు, దగ్గు ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆయనకు కృత్రిమ శ్వాస అందించారు. అప్పుడే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి.

భయపెడుతున్న కరోనా.. ఏపీలో తొలి మరణం

అయితే విజయకాంత్‌ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యానికి సహకరిస్తున్నారని నవంబర్‌ 23న డాక్టర్లు ప్రకటించారు. చికిత్స అనంతరం ఈ నెల 11న ఆయనను డిశ్చాక్జీ చేశారు. అయితే మళ్లీ రెండు రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యలతో దవాఖానలో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయనుకు కరోనా నిర్ధారణ అయింది. శ్వాస సరిగా తీసుకోలేకపోతుండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.చివరికి విజయ్ కాంత్ ఈ రోజు కన్నుమూశారు.

Leave a Reply