second marriage | అరాచకం… 60ఏళ్ల వయస్సులో మరో పెళ్లి చేసుకున్న స్టార్ విలన్..!

second marriage | ఆశిష్‌ విద్యార్థి 1962లో జన్మించాడు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా వివిధ భాషల్లో సినిమాల్లో నటించాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, ఒడియా, బెంగాలీ తదితర 11 భాషల్లో యాక్ట్ చేశాడు. 300కుపైగా చిత్రాల్లో ఆశిష్ విద్యార్థి నటించాడు. 1995లో ద్రోహ్‌కాల్ మూవీకి జాతీయా అవార్డు అందుకున్నాడు. తెలుగులో పోకిరి సినిమా ఆశిష్‌ విద్యార్థికి భారీ క్రేజ్ తీసుకువచ్చింది.

గుడుంబా శంకర్, అతిథి, తులసి, లక్ష్యం, అలా మొదలైంది, నాన్నకు ప్రేమతో.., జనతా గ్యారేజ్, ఇస్మార్ట్ శంకర్ తదితర తెలుగు సినిమాల్లో అనేక సినిమాల్లో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇటీవల కాస్త సినిమాలను తగ్గించిన ఆశిష్‌ విద్యార్థి.. తన యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు.ఐతే తాజాగా ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నాడు.

allroudadda
allroudadda

60 ఏళ్ల వయసులో మరోసారి ఈ సీనియర్ నటుడు పెళ్లి పీటలు ఎక్కడం విశేషం. గురువారం అస్సాంకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ రూపాలీ బారువాను వివాహం చేసుకున్నాడు. అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వివాహం జరిగింది. త్వరలో భారీ రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆశిష్ విద్యార్థి పెళ్లి ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ప్రతిరోజు ఉదయాన్నే ఆ పనులు చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు అంటా..!

ఆశిష్ విద్యార్థి-రూపాలి బారుహ్‌ వివాహం కోల్‌కతాలో జరిగింది. ప్రస్తుతం రూపాలి కోల్‌కతాలో ఉండడంతో అక్కడే పెళ్లి చేసుకున్నాడు. ఈ దశలో వివాహం చేసుకోవడం అనేది ఒక అసాధారణమైన అనుభూతిగా అనిపిస్తోందని అన్నాడు ఆశిష్‌ విద్యార్థి. తన లవ్ స్టోరీ గురించి చెబుతూ ఇది పెద్ద స్టోరీ అని.. దాని గురించి మళ్లీ మాట్లాడుతానని చెప్పాడు. తాము కొంతకాలం క్రితం కలుసుకున్నామమని.. తమ సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని పెళ్లి కూతురు రూపాలి బారుహ్ తెలిపారు.

Leave a Reply