అల్లుడితో అమెరికాకి లేచిపోయిన అత్త..! సమాజం ఎటుపోతోంది?

విదేశాల్లో ఉంటున్న అల్లుడు తన భార్యను వెంటబెట్టుకొని అత్తారింటికి వచ్చాడు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు విదేశాల్లోనే ఉన్నారు. అల్లుడుతో లేచిపోవాలనుకున్న అత్త పక్కా ప్లాన్ వేసింది. వంటగది నుంచే ప్లాన్ అమలు చేసింది. అల్లుడుతో ఆమె ప్రేమాయణం సాగిస్తున్న విషయం ఇన్నేళ్లు ఎవరికీ తెలియదు. ఇప్పుడు తెలిశాక అంతా షాక్ లో ఉన్నారు. తన ఇంటికి వచ్చిన అల్లుడితో ప్రత్యేకంగా చికెన్ కర్రీ వండి పెట్టింది అత్త.

అతని భార్య (తన కూతురు), మామగారు (భర్త) కు మాత్రం మటన్ కర్రీ వండిపెట్టింది.ఆ మటన్ కర్రీలో నిద్ర మాత్రలు కలిపింది. తాను మాత్రం నిద్ర మాత్రలు కలపని చికెన్ కర్రీని తింది. లంచ్ సందర్భంగా మామగారికి బాగా మద్యం తాగించాడు అల్లుడు. భోజనం తర్వాత భార్య, మామగారు నిద్రమత్తులోకి జారుకున్నారు. అదే సరైన టైమ్ అని భావించిన అత్త, అల్లుడితో విదేశాలకు చెక్కేసింది.

వాళ్ళిద్దరి మధ్య 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు నిద్ర లేచిన మామకి దిమ్మదిరిగింది. ఎక్కిందంతా దిగిపోయింది. తన భార్య, అల్లుడు కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు రమేష్. కానీ అల్లుడు తన భార్యను ప్రేమిస్తున్నాడని, తన భార్య కూడా అతన్ని ప్రేమిస్తోందని ఏనాడు అతను అనుకోలేదు.

అంత రహస్యంగా ఈ లవ్ స్టోరీ నడిచింది. పెళ్లి తర్వాత ఆ కూతురు, అల్లుడు తరచు అత్తమామల ఇంటికి వచ్చి వెళ్లేవారు. కొన్నాళ్ళు ఇలా అయ్యాక భార్యను తీసుకొని విదేశాలకు వెళ్లిపోయాడు నారాయణ్. గత ఏడాది డిసెంబర్ 30 చివరిగా అత్తారింటికి భార్యతో వచ్చాడు. ఆ తర్వాత ఈ డ్రామా నడిచింది. అనంతరం పోలీసులు కేసు రాశారు. నారాయణ్ ను విదేశాల నుంచి భారత్ కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply