Kohli Biopic | విరాట్ కోహ్లీ బయోపిక్‌లో.. రామ్‌చరణ్, రామ్‌ పోతినేని ..? ఎవరు బెస్ట్

Kohli Biopic | ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య ఫ్లాప్ అవడంతో చరణ్ నుంచి సాలిడ్ హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.అయితే.. తాజాగా హీరో రామ్ చరణ్ సంచలన ప్రకటన చేశాడు. అవకాశం వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తానన్నారు హీరో రామ్ చరణ్.

క్రీడా నేపథ్యమున్న సినిమా చేయాలన్న కల తనకు చాలా కాలంగా ఉందన్నారు. లుక్ పరంగా తన కోహ్లీకి దగ్గరగా ఉంటానని, సిల్వర్ స్క్రీన్ పై అతడి రోల్ ను పోషించే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు ఢిల్లీ లో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో అడిగిన ప్రశ్నకు చెర్రీ బదులిచ్చారు. అలాగే మరో పక్క మాస్ హీరో రామ్ పోతినేని నటించిన ‘స్కంద’ సినిమా ఈ నెల 28న విడుదల కానున్న నేపద్యం లో రామ్‌ పోతినేని ప్రమోషన్స్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘స్కంద’ తాజా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా రామ్‌ని బాలీవుడ్‌ ఇంటర్వ్యూయర్ సంకేత్ మాత్రే ఇంటర్వ్యూ చేశారు. రామ్, సంకేత్ మధ్య మాటల మధ్యలో విరాట్ కోహ్లీ ప్రస్తావన వచ్చింది. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలికలపై, కోహ్లీ బయోపిక్ చేసే అవకాశం గురించి రామ్‌ని సంకేత్‌ అడిగాడు.మీరు విరాట్ కోహ్లీలా ఉన్నారని సోషల్ మీడియాలో చాలా మంది చెబుతూ ఉంటారు.

ఒకవేళ ఆయన బయోపిక్ చేసే అవకాశం వస్తే?’ అని సంకేత్ అడిగాడు. దీనికి రామ్‌ సమాధానం ఇస్తూ.. ‘అవును, కోహ్లికి నాకు పోలిక ఉందని చాలా మంది చెప్పారు. నేను ‘ఇస్మార్ట్ శంకర్’ లుక్ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. అప్పటి నుంచి విరాట్ కోహ్లీతో కంపేరిజన్ మొదలైంది. నాకు ఆఫర్ వస్తే అతని బయోపిక్ చేయాలనుకుంటున్నాను. విరాట్‌ బయోపిక్‌ అంటే ఎగ్జైటింగ్‌గా ఉంటుంది’ అని రామ్ చెప్పారు. క్రికెట్ నేర్చుకుంటానని కూడా తెలిపారు.

Leave a Reply