ప్రాణంతో పోరాడుతున్నాను అంటూ స్టార్ హీరోయిన్‌ ఎమోషనల్ పోస్ట్..!

2014లో విడుదలైన నారా రోహిత్ సినిమా ‘రౌడీ ఫెలో’ సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో రోహిత్‌ సరసన నటించి మెప్పించింది ప్రముఖ తమిళ హీరోయిన్‌ విశాఖ సింగ్‌. చూడచక్కని మోము, ఆకట్టుకునే అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందీ అమ్మాయి. 2007లో వచ్చిన ‘జ్ఞాపకం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విశాఖ సింగ్ తమిళ్‌లో వరుసగా సినిమాలు చేసింది. అలాగే హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్‌ చేసి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది.

మొహర్రం అనే లఘుచిత్రం, అక్తం చక్తం అనే సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం తురం అనే తెలుగు సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తోన్న విశాఖ సింగ్‌ తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్ట్ వైరల్‌ అవుతోంది. ఫోటోలను షేర్ చేస్తూ.. నేను ఎక్కువసేపు కిందపడి ఉండలేను. శీతాకాలంలో, వసంతకాలంలో నాకు వరుసగా విచిత్ర సంఘటనలు, ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి.

మళ్ళీ వేసవి రాగానే నా ఆరోగ్యం తిరిగి పుంజుకుంటుంది. ఇది తరచుగా జరుగుతుంది. ఏప్రిల్ నాకు ఎప్పుడూ కొత్త సంవత్సరంలా అనిపిస్తుంది. బహుశా ఇది కొత్త ఆర్ధిక సంవత్సరం లేదా నేను పుట్టిన నెల కాబట్టి ఏమో. ఎండాకాలం రాగానే మళ్ళీ ఆరోగ్యం కుదుటపడి పూర్తి ఉత్సాహంతో ముందుకి సాగుతాను. మంచి రోజులు ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపింది విశాఖ సింగ్. దీంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు విశాఖ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply