Vishal-Varalakshmi | ప్రాణం కన్న ఎక్కువ ప్రేమించుకున్న జయమ్మ -విశాల్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ?

allroudadda

Vishal-Varalakshmi | ప్రముఖ బాలీవుడ్ స్టార్ వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవ‌లే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ విలన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్ సినిమాల‌కి గోల్డెన్ లేడీగా గుర్తింపు తెచ్చుకుంది. వరలక్ష్మీకి(Vishal-Varalakshmi) చదువు పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో ఆఫర్స్ రావడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

తనకు హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చినప్పటికీ స్టోరీ కాస్త అటు ఇటుగా ఉండడంతో వరలక్ష్మి తండ్రి ఒప్పుకోలేదట. అలా వరలక్ష్మీ రిజెక్ట్ చేసిన సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో వరలక్ష్మి చాలా ఫీల్ అయ్యిందట. ఇక మరో సినిమాలో తనకు అవకాశం వచ్చింది.అదే టైంలో హీరో విశాల్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సమయంలోనే విశాల్, వరలక్ష్మీ మధ్య మంచి పరిచయం ఏర్పడింది.

allroudadda
allroudadda

ఇంట్లో తన తండ్రి ఒప్పుకోలేదట..

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కుటుంబసభ్యులకు వీరి ప్రేమ విషయం చెప్పడంతో వారు కాస్త నిరాకరించారు. విశాల్ ఇంట్లో ఒప్పుకున్నప్పటికీ, వరలక్ష్మి ఇంట్లో తన తండ్రి ఒప్పుకోలేదట.శరత్ కుమార్ ని అక్కడి నడిగేర్ సంఘం ఎలక్షన్స్ లో విశాల్ ఎదిరించినందుకు వరలక్ష్మి తండ్రి ఒప్పుకోలేదట.

దీంతో ఈ కారణం వల్లనే విశాల్-వరలక్ష్మి విడిపోయారు. ఇప్పటికీ వీరిద్దరిపై ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ వాటిపై విశాల్, వరలక్ష్మి ఇంతవరకు స్పందించలేదు. మరి వీరు ఇప్పటికీ ప్రేమించుకుంటున్నారా..? వివాహం చేసుకుంటారా..? లేదా..? అనేది తెలియదు. ఇక వరలక్ష్మీ ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

Leave a Reply