నరేష్ అనే వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు.. హీరో కృష్ణ తమ్ముడు

Hero Krishna Brother: అప్పట్లో కృష్ణ డేట్స్ దొరకడం కూడా చాలా కష్టం గా ఉండేది. అసలు గ్యాప్ తీసుకోకుండా ఓకే ఏడాది అత్యధిక సినిమాలు చేసిన ఘనత కృష్ణ కే సొంతం. అదే విధంగా కౌబాయ్ లాంటి పాత్రను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే. కృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే అల్లూరి మళ్లీ పుట్టాడా అనే రేంజ్ లో తన నటనతో మెప్పించాడు.అయితే ఒకానొక సమయం లో కృష్ణ కు వరుస ఫ్లాప్ లు పడ్డాయి. ఏకంగా కృష్ణ కు వరుసగా 12 ఫ్లాప్ లు పడ్డాయి. దాంతో కృష్ణ కానీ అయిపోయింది అని చాలా మంది చెవులు కొరుకున్నారు.

అంతే కాకుండా కృష్ణ తో సినిమాలు కూడా చేయడానికి ముందుకు రాలేదు.కానీ అలాంటి సమయం లో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సొంతంగా బ్యానర్ ను ప్రారంభించాడు. పద్మాలయ ఆర్ట్ పిక్చర్స్ పేరుతో ఆ బ్యానర్ ను ప్రారంభించారు. ఇక ఆ బ్యానర్ లో మొదటి సినిమా పాడిపంటలు తెరకెక్కించారు. ఈ సినిమా తరవాత మళ్లీ కృష్ణ అసలు తిరిగి వెనక్కి చూసుకోలేదు.తాజాగా ఆదిశేషగిరి రావు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఇంటర్వ్యూ లో కృష్ణ చనిపోయిన సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు, అలాగే రమ్య నరేష్ వ్యవహారం, ఆస్తుల పంపకాలపై వివరాలను తెలియచేశాడు.నరేష్ రమ్య రఘుపతి విషయంపై స్పందిస్తూ అతనితో మాకు సంబంధం ఏంటి మా అన్నయ్య రెండవ భార్యకు పుట్టిన కొడుకు అయితే మా ఇంటి వారసుడు అవుతాడా నరేష్ అనే వాడితో మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కుండ బద్దలు కొట్టాడు.

ఇక కృష్ణ కన్నుమూసిన సమయంలో అతని అనాధ శవంగా ఇంట్లో వదిలేసి అందరూ వెళ్లిపోయారు అంటూ రమ్య రఘుపతి ఒక వీడియో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ వీడియో గురించి స్పందిస్తూ ఆదిశేషగిరిరావు ఆమె చెబుతున్నవన్నీ కూడా అబద్ధాలే అని చలిగా ఉండి ఎక్కువగా అలసిపోయారు కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్పడంతో అందరూ వెళ్లిపోయారే తప్ప ఆ రోజు రాత్రి తన కొడుకు మరియు మేనల్లుడు కూడా అక్కడే ఉన్నారని, వారు పక్కకు వెళ్ళిన సమయంలో ఆమె వీడియో చూసి అలా మీడియాకు లీక్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.

Leave a Reply