గర్భాశయం ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే..!

మహిళల శరీరంలో గర్భాశయం కీలక పాత్ర పోషిస్తుంది.

నెలసరి సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఫైబ్రాయిడ్స్‌ రాకుండా ఉండాలంటే గర్భాశయం ఆరోగ్యంగా ఉండాలి.

బచ్చలికూర, కాలే, కొల్లార్డ్ వంటి ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తింటే మీ గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది.

తృణధాన్యాలు పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరమైన బి విటమిన్లు, మెగ్నీషియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.

పెరుగు, కేఫీర్ వంటి ప్రోబయోటిక్ ఎక్కువగా ఉండే ఆహారాలు కడుపులోని మైక్రోబయోటాను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.

బాదం, వాల్ నట్స్, అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

దానిమ్మ, నారింజ, బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే  ఎన్నో పోషకాలు ఉంటాయి.

అలాగే  ఒత్తిడికి దూరంగా ఉండాలి.

ధ్యానం, యోగా, చిన్నచిన్న వ్యాయామాలు చేయాలి.