Wedding Celebrations | చరణ్ తో నాటు నాటు పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ ఖాన్స్

allroudadda

Wedding Celebrations | ఇంటర్నెట్‏లో ఎక్కడ చూసిన అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ వీడియోస్ దర్శనమిస్తున్నాయి. గుజరాత్‏లోని జామ్ నగర్‍లో గత మూడు రోజులుగా ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.ప్రపంచంలోని అత్యంత సంపన్నులు, వ్యాపారవేత్తలతోపాటు.. సినీ ప్రముఖులు, క్రికెటర్స్ ఈ వేడుకలకు హజరయ్యి సందడి చేస్తున్నారు. ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రెషన్స్ మార్చి 1న మొదలై నేటితో ముగియనున్నాయి.

Ananth Ambani | కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ

ఈ వేడుకలలో బిల్ గేట్స్, ట్రంప్ ఇవాంక, మెట్ సీఈవో జుకర్ బర్గ్, సద్గురు, ధోని, సచిన్, సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు హజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి వెళ్లారు. తాజాగా చరణ్ కు సంబంధించిన ఓ వీడియోను ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. అందులో తమ అభిమాన సెలబ్రెటీస్ కలిసి ఉండడం చూసి మురిసిపోతున్నారు.

allroudadda
allroudadda

ప్రీవెడ్డింగ్ సెలబ్రెషన్లలో రెండవ రోజు రామ్ చరణ్, ఉపాసనతోపాటు.. ఎంఎస్ ధోని, అతడి భార్య సాక్షితో కలిసి కనిపించారు. రంతా కలిసి దాండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ తరువాత క నైట్ పార్టీలో స్టేజిపై డ్యాన్సులతో, పాటలతో అందరూ అలరించారు. ఇందులో భాగంగా బాలీవుడ్ ఖాన్స్ త్రయం, స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్(Salman Khan), షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), అమీర్ ఖాన్(Aamir Khan) లు ముగ్గురూ స్టేజిపై పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

38 ఏళ్ల వయస్సులో సీక్రెట్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి..

స్టేజిపై ముగ్గురు ఖాన్స్ RRR సినిమాలోని నాటు నాటు పాట హిందీ వర్షన్ కి స్టెప్పులు వేశారు. పర్ఫెక్ట్ గా వేయకపోయినా వాళ్ళకి వచ్చిన స్టెప్పులతో బాగానే మేనేజ్ చేశారు. చివర్లో రామ చరణ్ ని కూడా స్టేజిపైకి పిలిచి చరణ్ తో కలిసి అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్టెప్పులు వేశారు. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. చరణ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బాలీవుడ్ ముగ్గురు స్టార్ హీరోలు చరణ్ ని స్టేజిపైకి పిలిచి నాటు నాటు స్టెప్పులు వేయడంతో అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో చరణ్ బాగా వైరల్ అవుతున్నారు.

Leave a Reply