‘Project K’ లో కమల్ హాసన్ రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!

ఈమధ్య కాలంలో ఇంత క్రేజీ కాంబినేషన్ ఏదీ కనిపించలేదు. ప్రాజెక్టు-Kలోకి కమల్ హాసన్ వచ్చాడు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం దాదాపు ఏడాదిగా కమల్ హాసన్ ను ట్రై చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇందులో నటించేందుకు రీసెంట్ గా కమల్ అంగీకరించినట్టు కూడా ఊహాగానాలు వినిపించాయి.ఎట్టకేలకు ఈ ప్రాజెక్టులోకి కమల్ హాసన్ వచ్చారనే విషయాన్ని వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది.

ఇండియాకు చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిశారంటూ ఓ చిన్న వీడియో రిలీజ్ చేశారు.ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. హీరోతో సమానంగా, దాదాపు హీరో పాత్రలానే ఇది ఉంటుందని, కాకపోతే అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ పాత్రకు కమల్ హాసన్ మాత్రమే న్యాయం చేయగలరని దర్శకుడు నాగ్ అశ్విన్ నమ్మాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు.

విక్రమ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు కమల్ హాసన్. ప్రస్తుతం ఇండియన్-2 సినిమా చేస్తున్నాడు. ఇలా హీరోగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో ప్రాజెక్ట్-Kలో నటించేందుకు అంగీకరించాడంటే.. ఈ సినిమాలో అతడి పాత్ర ఎంత కొత్తగా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తోంది ప్రాజెక్ట్-K సినిమా. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పుడు కమల్ రాకతో ఈ ప్రాజెక్ట్ వెయిట్ మరింత పెరిగింది. దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో దిశా పటానీ కనిపించనుంది. మరోపక్క ‘ప్రాజెక్ట్ K’ కోసం హీరో ప్రభాస్ కి రూ.150 కోట్ల వరకు ఇస్తున్నారని టాక్. ఇప్పుడు ఇదే సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న కమల్ కి రూ.100 కోట్లకు పైనే రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కెరీర్ లోనే కమల్ తీసుకోబోయే అత్యధిక పారితోషికం ఇదవుతుంది. ఇందులో నిజమెంతనేది స్పష‍్టత రావాల్సి ఉంది.

Leave a Reply