తాతకు తగ్గ మనవరాలు.. నారా బ్రాహ్మ‌ణి గురించి తెలిస్తే శ‌భాష్ అనాల్సిందే..!

నారా బ్రాహ్మణి Nara Brahmani గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి. ఈమె అటు నందమూరి కుటుంబం వైపు ఇటు నారా కుటుంబం వైపు ఆశాజ్యోతి గా కనబడుతుంది. ఇప్పటికి కూడా నారా బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థ కి ముఖ్య పాత్ర పోషిస్తోంది. పైగా ఈమె బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరియు ట్రస్ట్ కి బోర్డు మెంబర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

నందమూరి తారక రామారావు గారి తర్వాత చాలా మంది వాళ్ళ కుటుంబం నుండి రాజకీయాల్లోకి సినిమాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల్లోకి వెలుగు వెలిగి అందరికు ఆదర్శంగా నిలిచారు. అంత పేరు ఆయన వారసులు ఎవరూ కూడా తెచ్చుకోలేకపోయారు. బాలకృష్ణ సినిమాల్లో బాగానే పైకి వచ్చినా రాజకీయాలని పెద్దగా పట్టించుకోలేదు.ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తిగా ఆయనకి పేరు ఉంది ఈ విషయం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.

హరికృష్ణ, పురందేశ్వరి కూడా కాస్తోకూస్తో బాగానే వాళ్ళకి తగ్గ విధంగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే హరికృష్ణ పురందేశ్వరి వంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చినా కూడా పూర్తిస్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయారు. Nara Brahmani నారా బ్రాహ్మణి కి మాత్రం తగ్గ గుర్తింపు వచ్చింది.అటు హెరిటేజ్ సంస్థలో ముఖ్యపాత్ర పోషిస్తూ ఇటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ కి బోర్డు మెంబర్ గా ఆమె మంచి పేరుని తెచ్చుకున్నారు.

ఆమె స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. అమెరికాలో స్థిరపడకుండా మళ్లీ భారతదేశానికి వచ్చి తన తండ్రి చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ని ఆమె పెళ్లి చేసుకున్నారు. మామ వ్యాపారాన్ని కూడా ఆమె చూసుకుంటున్నారు. ఒక యువ వ్యాపారవేత్తగా ఆమె దేశమంతా తిరుగుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు.

Leave a Reply