CRICKETE: మన క్రికెటర్లు లంచ్‌ బ్రేక్‌లో ఏం తింటారో తెలుసా?

టెస్ట్‌ క్రికెట్‌ను CRICKETERS చూసే వాళ్లకు ఈ లంచ్‌ బ్రేక్ గురించి తెలుసు. ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో ప్రతి రోజూ ఉదయం రెండు గంటల ఆట తర్వాత తొలి సెషన్‌ ముగుస్తుంది. ప్లేయర్స్‌ లంచ్‌ కోసం వెళ్తారు. ఈ లంచ్‌ బ్రేక్ Lunch Break 40 నిమిషాల పాటు ఉంటుంది. క్రీజులో అటుఇటూ పరుగెత్తే బ్యాట్స్‌మెన్‌కైనా, బౌలర్లు, ఫీల్డర్లకైనా కాస్త శరీరం రీఛార్జ్‌ కావడానికి ఈ లంచ్‌ బ్రేక్‌ బాగా పనికొస్తుంది.

అయితే ఈ బ్రేక్‌లో వాళ్లు తీసుకునే ఫుడ్‌పై ఫీల్డ్‌లో వాళ్ల ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. పైగా భారత ఉపఖండంలో టెస్ట్‌ మ్యాచ్‌లు సాధారణంగా ఉదయం 9, 9.30 గంటల మధ్య ప్రారంభమవుతాయి. ఆ లెక్కన రెండు గంటలు అంటే 11 లేదా 11.30 గంటలకు లంచ్ బ్రేక్‌ ఉంటుంది. ఎటూ కాని ఆ సమయంలో ప్లేయర్స్‌ లంచ్‌ ఏం చేస్తారు అన్న అనుమానం చాలా మంది క్రికెట్‌ CRICKETERS చూసే అభిమానులకు కలుగుతుంది.

లంచ్ బ్రేక్ సమయంలో…
క్రికెట్ మ్యాచ్ లో సమయాన్నిబట్టి.. బ్రేక్ సమయంలో వివిధ ఆహార పదార్థాలను, ద్రవ పదార్థాలను తీసుకుంటారు క్రికెటర్లు. క్రికెటర్లకు అలసట రాకూడదని అరటిపండు మరియు ప్రోటీన్ బార్ లాంటివి తక్కువ పరిమానం లో తీసుకుంటారు. ఈ ఫుడ్ ఎక్కువగా బ్యాట్స్మెన్ తీసుకుంటారు. అలాగే బౌలర్లు కూడా పరిగెత్తేటప్పుడు ఈ ఫుడ్ ఎక్కువగా తింటారు. అధిక శక్తిని ఇచ్చే ఫుడ్డును వీరు తీసుకుంటారు.

ఇక మిగతా వాళ్ళు అంటే బ్యాటింగ్ టీం లో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చునే వాళ్ళు.. బౌలింగ్ టీంలో కేవలం ఫీల్డింగ్ చేసే వాళ్ళు ఏదైనా తినడానికి అవకాశం ఉంటుంది. వీళ్లకు చాలా వెరైటీ వంటకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్లకు ప్రోటీన్ ఎక్కువగా ఇచ్చే చికెన్, చేపలు కచ్చితంగా ఉంటాయి.

శాఖాహారం ప్లేయర్ల కోసం పప్పులు, ఫ్రూట్ సలాడ్ అందుబాటులో ఉంటాయి. లంచ్ చివర్లో ఫ్రూట్స్ అలాంటి డిసర్ట్ కూడా ఉంటాయి. అలాగే కొవ్వు తక్కువగా ఉండే ఐస్ క్రీమ్ లు కూడా లభిస్తాయి. వేరే దేశంలో క్రికెటర్స్ ఆడితే అక్కడి పరిస్థితులను బట్టి ఫుడ్డు వారికి లభిస్తుంది.

Leave a Reply