అమ్మో భూమిక భర్త బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..?

భూమిక చావ్లా గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా తేరే నామ్ తో సినీ కెరీర్ ని ప్రారంభించిన ఈమె దాని తర్వాత నార్త్ లో వచ్చిన చాలా ఆఫర్లు మిస్ అవ్వడంతో బాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది. తర్వాత యువకుడు అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ,మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అలా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో భూమిక పెళ్లి చేసుకుంది. 2007లో భరత్ ఠాకర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది .అయితే వీరిద్దరి ది ప్రేమ వివాహమట. భరత్ ఠాకూర్ భూమిక యోగా టీచర్. అలా వీరిద్దరి మధ్య మొదట పరిచయం ఏర్పడింది.

అనంతరం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు .అనంతరం మీ ఇద్దరికీ 2014లో ఎస్ అనే ఒక బాబు కూడా పుట్టాడు. పెళ్లి తర్వాత సినిమాలలో నటించడం తగ్గించేసింది భూమిక. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టింది .ఎంసీఏ, రూలర్, సవ్యసాచి, సిటీ మార్ ,సీతారామం వంటి సినిమాలలో కొన్ని కీలక పాత్రల్లో నటించింది. ఈ క్రమంలోనే భూమిక భర్త ఠాకూర్ ఎవరు అని నటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.

అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్న విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు.తాజాగా అందుతున్న సమాచారం మేరకు భూమిక భర్త ఠాగూర్ ప్రముఖ యోగ అనలిస్ట్ మరియు వ్యాపారవేత్త అని తెలుస్తుంది. అతను ఉత్తరాఖండ్లో హరిద్వార్లో పుట్టాడు ఈయన యోగ స్టూడియోల గ్లోబల్ చైన్ ఆర్టిస్ట్ యోగ వ్యవస్థాపకుడట. దాంతోపాటు అతను బ్రీత్ అనే వెల్నెస్ ఇంకా లైఫ్ స్టైల్ బ్రాండ్ ను కూడా స్థాపించారట..వాటితో పాటు యోగ మరియు ఆధ్యాత్మికత పై అనేక పుస్తకాలను కూడా రచించారట. వాటితో పాటు ఆయనకి వేల కోట్ల ఆస్తులు కూడా ఉన్నట్లుగా సమాచారం..!!

Leave a Reply