ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌..!బాలయ్య 107వ చిత్ర దర్శకుడు ఎవరో తెలుసా..!

బాలకృష్ణ అభిమానులకు బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. బాలయ్య బర్త్‌డే(జూన్‌ 10)సందర్భంగా ఆయన నటించబోయే 107వ సినిమా పై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ బ్యానర్‌పై నిర్మించనుంది. ఇందుకు సంబంధించి పోస్టర్‏తో పాటు ఇంట్రడ్యూసింగ్ వీడియోను దర్శకుడు గోపిచంద్ మలినేని తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసుకున్నారు.

‘క్రాక్‌’ విజయం తర్వాత బాలకృష్ణ కోసం గోపీచంద్‌ మలినేని ఓ మాస్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే . ఈ మేరకు 107వ చిత్రంలో బాలయ్య మాస్‌ లుక్‌లో సందడి చేసే అవకాశాలున్నట్లు సమాచారం.కాగా, ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘అఖండ’పూర్తయిన తర్వాత గోపీచంద్‌ మలినేని ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది.

2018లో విడుదలైన జైసింహా తరువాత బాలకృష్ణ కు హిట్ అనేది లేదు. జైసింహా కూడా కమర్షియల్ గా వర్క్ అవుటైనా ఫ్యాన్స్ కు అంతా నచ్చిన సినిమా కాదు. ఇటువంటి తరుణంలో అఖండ, #NBK107 వంటి ప్రామిసింగ్ ప్రాజెక్టులు బ్యాక్ టు బ్యాక్ పడటంతో ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు.పైగా పుట్టినరోజు పొద్దునే తారక్ బాబాయ్ కి విష్ చేసి మరింత జోష్ నింపాడు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘బాబాయ్’ అనే పదం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. మొత్తానికి అబ్బా ఇది కదా పర్ఫెక్ట్ బర్త్ డే సెలబ్రేషన్ అంటే! అనే విధంగా బాలయ్య బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి.