Ram Charan: రామ్ చరణ్ తో పెళ్లి మిస్ చేసుకున్న స్టార్ హీరో కూతురు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటి రామ్ చరణ్ Ram Charan – ఉపాసన కామినేని జంట..వీళ్ళని చూసినప్పుడల్లా ఇంత ప్రేమగా ఉంటె ఎంత బాగుంటుందో అని అసూయ పడిన జంటలు ఎన్నో ఉన్నాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు..వీళ్లిద్దరి మధ్య దాంపత్య సంబంధం ఏర్పడి పదేళ్లు దాటింది..2012 జూన్ 14 వ తారీఖున వీళ్లిద్దరి పెళ్లి అతిరథ మహారధుల సమక్షం లో అంగరంగ వైభవం గా జరిగింది..

ప్రస్తుతం ఈ దంపుతులిద్దరికి త్వరలో వారసుడు/వారసురాలు రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇందులో ఎంత వరుకు నిజం ఉందొ తెలియదు కానీ, రామ్ చరణ్ తో ఉపాసన పెళ్లి ఫిక్స్ కాకముందు చాలా హై డ్రామానే నడించిందట..వాటికి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో చాలా కాలం తర్వాత బయటపడి తెగ హల్చల్ చేస్తున్నాయి..

అసలు విషయానికి వస్తే రామ్ చరణ్ Ram Charan కి తొలుత వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత తో పెళ్లి చేద్దాం అనుకున్నారట..చిరంజీవి మరియు వెంకటేష్ ఇద్దరు కూడా ఫామిలీ ఫ్రెండ్స్..వీళ్లిద్దరి మధ్య దశాబ్దాల నుండి మంచి సన్నిహిత సంబంధం ఉంది..ఆ చొరవ తోనే వెంకటేష్ గారు స్వయంగా ఈ విషయాన్నీ ప్రస్తావించాడట..చిరంజీవి కూడా ఎంతో సంతోషించి వెంటనే ఒప్పుకున్నాడట..

ఈ విషయాన్నీ రామ్ చరణ్ కి చెప్పగా, అప్పుడు రామ్ చరణ్ Ram Charan ఉపాసన తో తనకి ఉన్న ప్రేమ వ్యవహారం ని బయటపెట్టాడట.ఇదే విషయాన్నీ వెంకటేష్ కి చెప్పగా ఆయన కూడా చాలా తేలికగా పర్లేదు పిల్లల ఇష్టాఇష్టాలను దాటి మనం ఏమి చేయలేము కదా అని సర్ది చెప్పుకున్నాడట..అలా చిరంజీవి మరియు దగ్గుపాటి కుటుంబాలు ఒకటయ్యే ఛాన్స్ మిస్ అయ్యింది..వెంకటేష్ తన పెద్ద కూతురు ఆశ్రితా కి 2019 వ సంవత్సరం లో ఘనంగా అతిరధ మహారధుల సమక్షం లో ఘనంగా పెళ్లి చేసాడు.

Leave a Reply