రోడు ప్రమాదంలో చనిపోయిన ఈ నంద‌మూరి నటుడు ఎవరో తెలుసా..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకతే వేరు. ఆ కుటుంబం నుంచి దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు తర్వాత ఆయన వారసులుగా పలువురు హీరోలు ఎంట్రీ ఇచ్చారు. వారిలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. వీళ్ల తర్వాత కల్యాణ్ రామ్ మాత్రమే ఓ రేంజ్‌ను అందుకున్నాడు. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క హీరో సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇందులో బాధాకరమైన విషయం ఏమిటంటే నందమూరి వంశానికి రోడ్ యాక్సిడెంట్ లో ఒక శాపంగా మారింది. ఈ రోడ్ యాక్సిడెంట్ వలన నందమూరి ఫ్యామిలీ లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వారు ఎవరూ? ఏమిటి?పూర్తి విశేషాలు తెలుసుకుందా.

నందమూరి వంశం లో చాలామంది యాక్సిడెంట్ లకు గురయ్యారు.
అయితే వీరిలో కొద్దిమంది గాయాలతో బయటపడితే, మరికొంతమంది అనంతలోకాలకు వెళ్లిపోయారు. అయితే 2018 లో నందమూరి హరికృష్ణ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. అయితే ఆయన కంటే ముందుగా పెద్ద కుమారుడైన జానకిరామ్ అదే తరహాలో రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు. అయితే 2018 లో నందమూరి హరికృష్ణ ప్రమాదవశాత్తు చనిపోవడంతో అప్పట్లో సినీ ఇండస్ట్రీలో అలాగే నందమూరి ఫ్యామిలీ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు రామకృష్ణ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అయితే అదే పేరు పెట్టుకున్న మరో కుమారుడు చావు అంచులదాకా వెళ్లి బతికి బయటపడ్డారు. ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి కూడా ప్రమాదంలోనే మృతి చెందారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్లకు గురైనా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.అయితే వీళ్లే కాదు ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కుటుంబం సైతం రోడ్ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. స్వయంగా త్రివిక్రమరావు యాక్సిడెంట్‌కు గురై ప్రాణాలతో బయటపడితే, అదే యాక్సిడెంట్‌లో ఆయన చిన్నకుమారుడు హరీన్ చక్రవర్తి మృతి చెందారు. అలాగే పెద్ద కుమారుడు అయినా కల్యాణ్ చక్రవర్తి కుమారుడు పృథ్వీ చక్రవర్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.

అయితే కల్యాణ్ చక్రవర్తి తరహాలోనే హరీన్ చక్రవర్తి కూడా నటన మీద ఆసక్తితో హీరోగా నటించిన మామాకోడళ్ల సవాల్ మూవీలో ఓ విభిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమా 1986 లో వచ్చింది. అయితే నిజానికి 1974 లో వచ్చిన మనుషుల్లో దేవుడు సినిమాలో కల్యాణ్ చక్రవర్తితో పాటు హరీన్ కూడా బాలనటుడిగా పరిచయం అయ్యాడు. అయితే పెద్దయ్యాక రేలంగి నరసింహారావు డైరెక్ట్ చేసిన పెళ్లికొడుకులొస్తున్నారు చిత్రంతో హీరో అయ్యాడు. అందులో యమధర్మరాజు గెటప్ కూడా వేశాడు. జ్వరం వస్తున్నా కూడా యమధర్మరాజు గెటప్ తో నాలుగు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ మూవీలో ఆయన సరసన నాయికగా సీత నటించారు. ఆ సినిమాతో పాటు మరో మూడు నాలుగు సినిమాలు కూడా హరీన్‌ హీరోగా ప్రారంభమయ్యాయి. అయితే కెరియర్ ఇంకా ఉండగానే కానీ యాక్సిడెంట్‌తో అకాల మరణం పాలయ్యాడు.