Problems | నిజంగా మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయి ?

allroudadda

Problems | మీరు ఎప్పుడైనా గమనించారా.. మంచి చేసేవారు ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఉంటారు. చెడ్డ పనులు చేసేవారు అక్రమంగా సంపాదించేవారు, ఇతరులను హింసించేవారు ఇలాంటి వారికి మాత్రం సర్వసుఖాలు ఉంటాయి. సాధారణంగా ఈ ప్రశ్న అందరికి వస్తుంది. ఎంత జాగ్రత్తగా నీతి నిజాయితీతో ఉన్న నాకెందుకు భగవంతుడు ఎన్ని కష్టాలు పడుతున్నాము. వాళ్లేమో ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. ఇతరుల కష్టంతో బ్రతుకుతున్నారు. ఇతరుల్ని మోసం చేస్తున్నారు. అయినా సరే అన్ని చెడ్డ పనులు చేస్తున్న సరే వాళ్ళెందుకు అంత సంతోషంగా ఉంటున్నారు.

నేనెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నానని నిత్యం భగవంతుడు దగ్గర అడుగుతూనే ఉంటారు. అడుగుతూనే ఉంటారు అయితే దీనికి ఒక కారణం ఉంది.ప్రతిదానికి చర్యకి ప్రతి చర్య అనేది తప్పకుండా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిని పంచభూతాలైన గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నిరంతరం గమనిస్తూ ఉంటాయి.దీనినే కర్మఫలం అని అంటారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి పని, ప్రాణి తను గత జన్మలో చేసిన పాపం, పుణ్యాల యొక్క కర్మ ఫలాన్ని మరో జన్మలో కచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది.జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది ధనవంతులు ఇంట్లో పిల్లలు బుద్ధిహీనంతో, అంగవైకల్యంతో ఉంటారు. ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్న కూడా ఏదో వారు అనుభవించలేరు.

allroudadda
allroudadda

అది కర్మఫలం( karma ). అంటే ఘోర పాపాలు చేసి ఉంటే, అంటే ధనాన్ని దొంగలించడం, వేరొకరికి అంగవైకల్యం కలిగించిన వంటి పాపాలను చేస్తే వారు ఈ జన్మలో ఇలాంటి పుట్టుకలో పుట్టవలసి ఉంటుంది. మరి వారి తల్లిదండ్రులు ఏం చేశారు? గత జన్మలో వారి పిల్లలు చేసిన పాపాలకు వీరు ఎందుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది, అంటే పెద్దలు సంపాదించిన ఆస్తి పాస్తులు మనకు వారసత్వం ద్వారా ఎలా అయితే సంక్రమిస్తాయో..

YS Sharmila | జగన్ నేను సీయం అయ్యాక ని అంతు చూస్తా.. వైఎస్ షర్మిల.

అదేవిధంగా వారు చేస్తున్న పాప, పుణ్యాలు కూడా వారి తరాల వారికి తప్పకుండా బదిలీ అవుతూ ఉంటాయి.ఉంటుంది. అలాంటి వారి ఇంట్లోనే ఇలా గత జన్మలో ఘోర పాపాలను చేసిన వారు ఈ జన్మలో కర్మ ఫలాన్ని అనుభవించడానికి పుడుతూ ఉంటారు. ఇక మంచి వారికి ఎప్పుడూ వరుసగా కష్టాలు వస్తున్నాయి అనే విషయానికి వస్తే వారు ఈ జన్మలో ఎలాంటి దోషాలు చేయకపోయినా గత జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో ఫలితం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది.ఇక బంగారాన్ని ఎంతో వేడిలో మరిగిస్తే కానీ అందమైన ఆభరణంగా మారదు. అలాగే వరుసగా కష్టాలు అనేవి ఎప్పటికీ ఉండవు. చెడు వెనుకే మంచి, కష్టాల వెనుకే సుఖం అనేది తప్పకుండా ఉంటుంది.

Recent Posts

Leave a Reply