పెళ్లి అయిన తర్వాత మహిళలు ఎందుకు లావు అవుతారో తెలుసా..!

పెళ్లైన త‌రువాత చాలా మంది మ‌హిళ‌ల్లో చాలా మార్పులు వస్తుంటాయి . ముఖ్యంగా ఆడ‌వాళ్ల‌లో చోటు చేసుకునే మొద‌టి మార్పు.. బ‌రువు పెర‌గ‌డం.లేదా లావు కావ‌డం. ఇది స‌హ‌జ‌మైన‌ప్ప‌టికీ.. ఈ స‌మ‌స్య‌పై చాలా మంది చాలా అపోహాలు పెట్టుకుంటారు. మ‌గ‌వారు బరువు పెర‌గ‌డం ఎంత స‌హ‌జ‌మో.. స్త్రీలు బ‌రువు పెర‌గ‌డం కూడా అంతే స‌హ‌జం.కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఒత్తిడి: సాధారణంగా పెళ్ళైన తరువాత ఒత్తిడి పెరగ‌డం. ఇరువురి మధ్య గొడవల కారణంగా భావోద్వేగానికి గురై ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

ఫిట్ ‌నెస్: చాలా మంది ఆడవాళ్లు పెళ్ళైన తరువాత ఫిట్ గా ఉండటానికి చేసే కసరత్తులు ఆపేస్తారు. వివాహం చేసుకున్న జంటలతో పోల్చితే అవివాహితులు తమ ఫిట్ ‌నెస్ సమస్యలను మరింత తీవ్రంగా తీసుకుంటారు. పెళ్లి అయిన తర్వాత ఫిట్ గా ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపరు. కఠినమైన వ్యాయామాలు చేయటానికి ఇష్టపడరు.

గర్భధారణ: వివాహం తర్వాత మహిళలు బరువు పెరగడానికి మరో ప్ర‌ధాన కారణం గర్భధారణ. కడుపులో బిడ్డ పెరుగుతూ ఉండటం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఈ స‌మ‌యంలో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, యుట్రస్, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ వల్ల బరువు పెరుగుతారు. ఆ సమయంలో వచ్చే ఆహార కోరికలు, హార్మోన్స్ ఇన్‌బాలన్స్ కారణంగా మహిళలు ఎక్కువ బరువు పెరుగుతారు. అలాగే మహిళలు గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో పౌష్టికహారం తీసుకోవ‌డం మ‌రో కార‌ణం.

ఇలా అనేక కారణాలు ఉన్నాయి. మీరు వివాహం తర్వాత బరువు పెరగడానికి.. ఇలా కాకుండా మీ బరువు కంట్రోల్‌లో ఉండాలంటే ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుసుకుని దానిని సరి చేసుకోండి..

Leave a Reply