Indian Railways | ట్రైన్స్ పగలు కంటే రాత్రే ఎందుకు స్పీడ్ గా వెళ్తాయో తెలుసా…?

allroudadda

Indian Railways | ప్రపంచంలోనే ఇండియన్ రైల్వేస్ నాలుగవ అతిపెద్ద వ్యవస్థ. మనకి మొత్తం 68 వేలకు పైగా కిలోమీటర్ల తో రైలు మార్గం విస్తరించి వుంది. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు రైలు మార్గాన్ని మొదలుపెట్టిన విషయం మనకి తెలిసిందే. రైలు కి సంబంధించిన కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. పగటిపూట ఎందుకు రైళ్లు వేగంగా వెళ్ళవు..? రాత్రిళ్ళు ఎందుకు వేగంగా వెళ్తాయి అనే విషయానికి వస్తే… పగటి పూట రైల్వే ట్రాక్ పై ఎక్కువ సంచారం ఉంటుంది మనుషులు వెళ్లారు.

అలానే వాహనాలు జంతువులు ఇవన్నీ కూడా ట్రాక్ మీద వెళ్తూ ఉంటాయి. ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. దీని కారణంగానే రైళ్లు నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి పగటిపూట. పైగా రాత్రిపూట సిగ్నల్స్ బాగా కనబడతాయి. సిగ్నల్స్ కూడా రాత్రిపూట రైలు ముందుకు వెళ్లాలా ఆగిపోవాలా అనేది క్లియర్ గా కనపడతాయి. దూరం నుండి బాగా కనబడుతుంది. ఈ కారణం వల్లనే లోకోపైలట్లు స్పీడ్ గా రాత్రిపూట వెళ్తూ ఉంటారు రైలు ఆగాల్సి వచ్చినప్పుడు దూరం నుండి సిగ్నల్ చూసి ఆపుతారు.

allroudadda
allroudadda

పైగా రైల్వే ట్రాక్ కి సంబంధించిన పనులు ఏమైనా చేయాల్సి ఉంటే పగటిపూట చేస్తారు కాబట్టి పగటిపూట కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట ఇటువంటి పనులు అవి జరగవు కాబట్టి వేగంగా వెళ్ళినా రిస్క్ ఉండదు. రాత్రిపూట రద్దీ కూడా తక్కువ ఉంటుంది ఈ కారణం వల్లనే స్పీడ్ అనేది ఉదయం తక్కువ ఉంటుంది రాత్రి ఎక్కువ ఉంటుంది.

Recent Posts

Leave a Reply