జ్యోతిష్కుడు వేణుస్వామి భార్య ఈ సెలబ్రిటీనే.. ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.చాలామంది సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ వేణుస్వామి వార్తల్లో నిలుస్తున్నారు.చైతన్య సమంత విడిపోతారని వాళ్ల పెళ్లికి ముందే చెప్పడం ద్వారా వేణుస్వామి పేరు వార్తల్లో నిలిచింది.హీరోయిన్ రకుల్ వైవాహిక జీవితం గురించి కూడా వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారనే సంగతి తెలిసిందే.

అయితే వేణుస్వామి భార్య కూడా ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తే కావడం గమనార్హం.వేణుస్వామి భార్య పేరు శ్రీవాణి కాగా వీణ వాయించడం ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న శ్రీవాణిని అందరూ వీణా శ్రీవాణి అని పిలుస్తారు.యూట్యూబ్ వీడియోల ద్వారా వీణా శ్రీవాణి ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుని కెరీర్ ను కొనసాగిస్తున్నారు.వీణా శ్రీవాణి తెలుగులోని పాపులర్ సంగీత దర్శకుల దగ్గర కూడా పని చేశారని తెలుస్తోంది.

వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనది లవ్ మ్యారేజ్ అని సేమ్ కమ్యూనిటీ అని రిలేటివ్స్ ఇంట్లో శ్రీవాణి పరిచయమైందని తెలిపారు.ఆమెలో ఆర్ట్ ను చూసి తాను ఇష్టపడ్డానని వేణుస్వామి వెల్లడించారు.తన భార్య ఆలోచనల్లో తాను మహేష్ బాబు కంటే ఎక్కువని వేణుస్వామి తెలిపారు.నేను జీరోలో ఉన్న సమయంలో తను నన్ను నమ్మి వచ్చిందని వేణుస్వామి వెల్లడించారు.

వీణాశ్రీవాణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త తిరుపతి లడ్డూలా ఉంటారని తాను ఆర్.ఆర్.బీ స్టేట్ సెకండ్ ర్యాంకర్ అని ఆమె చెప్పుకొచ్చారు.తాను అందానికి అస్సలు ప్రాధాన్యత ఇవ్వనని ఆమె వెల్లడించారు.వేణుస్వామి విషయంలో తన నిర్ణయం కరెక్ట్ అని ఆమె పేర్కొన్నారు.వేణుస్వామి భార్య మనకు తెలిసిన సెలబ్రిటీనే అని తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.

Leave a Reply