మెట్రో స్టేషన్‌లో యువతి కిరాక్‌ డ్యాన్స్‌ స్టెప్పులు..!

హైదరాబాద్‌లో ఓ యువతి మెట్రో స్టేషన్‌లో అందరు చూస్తుండగానే, అదిరిపోయే స్టెప్పులు వేస్తూ టిక్‌టాక్ చేసింది. అంతేకాదు, ఆ టిక్‌టాక్ వీడియోని సోషల్ మీడియలో పోస్ట్ చేసింది. ఇక ఏముంది ఆప్‌లోడ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే తెగ వైరల్ అయ్యింది. వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్ యువతిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ‘టిక్‌టాక్ చేయడానికి నీకూ స్థలం ఎక్కడ దొరకలేదా? మెట్రో స్టేషన్ అధికారులు ఏం చేస్తున్నారు?’ అని తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఆ వీడియోలో.. ‘ఓ యువతి మెట్రో స్టేషన్‌లో అందరు చూస్తుండగానే కన్నడ హీరో సుధీప్ నటించిన విక్రంత్ రోనా చిత్రంలోని ‘రారా రక్కమ్మ’ అనే పాటకు అదిరిపోయే సెప్ట్పులు వేస్తుండగా, మరోకరు వీడియోను తీశారు. మెట్రోను ఎక్కడానికి వచ్చిన ప్రయాణికులు ఆశ్చర్యంగా యువతివైపే చూస్తున్నారు.

‘ అనంతరం ఆ వీడియోను వీక్షించిన మెట్రో రైలు అధికారులు స్పందించారు. “ఈ వీడియోను ఏ స్టేషన్‌లో చేశారో గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం” అని అన్నారు. ప్రస్తుతం ఆ యువతి ఎవరు? ఆమె వివరాలు ఏంటీ? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరోపక్క యువత పలు మెట్రో స్టేషన్‌ల్లో వికృత చేష్టలకు పాల్పడుతున్నారని, రోజురోజుకు టిక్‌టాక్, రీల్స్‌ల పేరుతో డ్యాన్స్‌లు చేస్తున్నారని పలువురు ప్రయాణికులు తీవ్రంగా మండిపడ్డారు. మెట్రో స్టేషన్‌ని కేంద్రంగా చేసుకొని ఇలాంటి టిక్‌టాక్‌లను చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.

Leave a Reply