Yarlagadda | జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు ఆకాశమంత ఎత్తులో ఉన్నారు..

allroudadda

Yarlagadda | టీడీపీ సభల్లో తారక్ అనుకూల నినాదాలు, జెండాల ప్రదర్శనలతో అభిమానులు నినాదాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో జూఎన్టీఆర్ తన సోదరుడుతో కలిసి నివాళి అర్పించారు. ఆ కాసేపటికే అక్కడకు వచ్చిన బాలకృష్ణ అప్పటికే అక్కడ జూఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలిగించాలని ఆదేశించారు. వాటి తొలిగింపుతో వివాదం మొదలైంది.

అయితే ఈ నేపద్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటముల బాధ్యత జగన్ దేనని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థులను మార్చడం అనేది సాధారణ విషయమేనని అన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసునని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. దాని గురించి ప్రత్యేకంగా తాను చెప్పాల్సిన పనిలేదని తెలిపారు.

allroudadda
allroudadda

రానున్న ఎన్నికల్లో ఏం జరగబోతుందో అందరికీ తెలుసునని అన్నారు.దీని పైన పలువురు స్పందించారు. ఈ సమయంలో జూ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కు సన్నిహితుడైన రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలిగిస్తే ఆయనకు వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు.

బంగారం కంటే ఎంతో విలువైన ఈ మొక్క గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

తారక్ స్థాయిని ఎవరైనా తగ్గించాలని అనుకుంటే ఆకాశం పైన ఉమ్మేసినట్లేనని కీలక వ్యాఖ్యలు చేసారు. ఎవరైనా తారక్‌ని తిట్టినా, అగౌరవపరిచినా.. వాళ్లకే నష్టమని తేల్చి చెప్పారు. తారక్ ఆ స్థాయికి చేరటం వెనుక కారణం ఆయన తల్లి షాలిని అని చెప్పుకొచ్చారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్‌ చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో లోకేష్ వివాహ పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

Leave a Reply