RamyaKrishna :యశ్ తో కలిసి దుమ్ముదులిపిన రమ్యకృష్ణ.. వైరల్ వీడియొ మీకోసం,

కన్నడ హీరో యాష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “కేజిఎఫ్” సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం జరిగింది. “కేజిఎఫ్ 2” తో గత ఏడాది వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో హీరో యాష్ నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించడం జరిగింది.

అలాగే రాజమౌళి తెరకెక్కించిన భారీ ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్, రానా.. వీరితో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శివగామి పాత్ర గురించి. ఆ పాత్రలో నటించారు అనడం కంటే రమ్య కృష్ణ జీవించారు అని చెప్పాలి.

ఈ సినిమాతో రమ్యకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది.తాజాగా రమ్యకృష్ణ, యశ్ కలిసి స్టెప్పులేసి అదరగొట్టారు. ఓ ప్రైవేట్ పార్టీలో రమ్యకృష్ణ, యశ్ కలిసి డాన్స్ చేశారు. ఇటీవల ఈవెంట్ కు యశ్, రమ్యకృష్ణ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో రాకీభాయ్, శివగామి కలిసి స్టెప్పులేసి అందరిని ఆకట్టుకున్నారు. యశ్ తో కలిసి రమ్యకృష్ణ స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply