#VarahiVijayaYatra నా రెండు చెప్పులు కొట్టేశారు, మీకు కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పిచండి ప్లీజ్..! పవన్ కళ్యాణ్

అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళితే తన రెండు చెప్పులు కొట్టేశారని, చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదని, కుర్తా వేసుకుంటే బాగుంటుందని షూస్ వేసుకుని వచ్చానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో అన్నవరం గుడిలో తన చెప్పుల చోరీ గురించి చెబుతూ పరోక్షంగా ఏపీ మాజీ మంత్రి పేర్ని నానికి జనసేనాని పవన్ కౌంటరిచ్చారు.

తాను తెల్ల దుస్తుల్లో కాకుండా ఇలా వేరే కలర్ డ్రెస్సులో ఎందుకు వచ్చానో మీకు డౌట్ రాలేదా అన్నారు. తనకు ఇష్టమైన రెండు చొప్పులు ఎవరో దొంగిలించారని, మీకు కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పిచండి ప్లీజ్ అని పవన్ అనేసరికి అక్కడ అరుపులు, కేకలతో దద్దరిల్లింది. వైసీపీ ప్రభుత్వం గుడిలో నా చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోయిందని,

ఇంతకు దిగజారిందని వ్యాఖ్యానించారు. కాగా, గూండాగాళ్ల కాళ్లు విరగ్గొడతానని పవన్ కల్యాణ్ చెప్పారు. నేరగాళ్ల అడ్డాగా ఏపీ మారిందని పవన్ అన్నారు. ఎంపీ కుటుంబ రక్షణకే దిక్కులేకుండాపోయిందని తెలిపారు. వైసీపీ వల్ల ఏపీలో మత్తు జోగుతుందని చెప్పారు. తనకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని సీఎం పరిపాలించడానికి సిద్ధమని అన్నారు.

Leave a Reply