ఒకప్పుడు బొగ్గులమ్మే అమ్మాయి..కానీ ఇప్పుడు ఈమె సక్సెస్ స్టోరీ తెలిస్తే మాత్రం కచ్చితంగా దండం పెట్టాల్సిందే!

ఈ యువతీ పేరు గోపిక గోవింద్.ఆమె గిరిజన కుటుంబానికి చెందిన అమ్మాయి. తనకు చిన్నప్పటి నుంచి ఎయిర్ హోస్టెస్ కావాలని కల ఉండటంతో మొత్తానికి ఆ కల తీర్చుకుంది. తను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనకు ఎయిర్ హోస్టెస్ కావాలన్న కోరిక పుట్టింది. కానీ తమ కుటుంబ సభ్యులు పేదవాళ్లు.అటవీ భూములను లీజుకు తీసుకొని వ్యవసాయం చేసి పొట్ట నింపుకుంటారు.

నిజానికి పేద పిల్లలు తమ స్థాయిని చూసుకొని అతిగా చదువుకోవాలన్న కోరిక పెంచుకోరు. కానీ గోపిక మాత్రం తాము ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకుంది. అలా బిఎస్సి వరకు చదివి ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ద్వారా స్కాలర్షిప్ అందుకుంది.అంతేకాకుండా పట్టుదలతో హిందీ, ఇంగ్లీష్ భాషలను కూడా నేర్చుకుంది.

అలా తొలిసారి ఇంటర్వ్యూలో పాల్గొనగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ కష్టపడి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా ఎంపికయింది. ఎనిమిదో తరగతిలో విమానంలో ఎగురురూ విధి నిర్వహణ చేయాలని కల గన్న గోపికా గోవింద్ తన కలను నెరవేర్చుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.ఆమె సక్సెస్ స్టోరీ విని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Leave a Reply