Marriage: వద్దంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని..ఈ యువతి ఏం చేసిందో చూడండి..

నేటి యువత ఆలోచనా విధానాల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. యువతీ యువకులు ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడిన తరువాతే వివాహాలు చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం పెళ్లైన తరువాత జరుగుతున్న గొడవలు చూసి అసలు పెళ్లే వద్దు బాబోయ్ అనే ఆలోచనలో పడిపోయారు. పెళ్లితో బంధం ఏర్పడటంతో పాటు బాధ్యతలు కూడా మీద పడుతాయి.

వైవాహిక జీవితంలో ఎన్నో కష్టసుఖాలు అనుభవించాల్సి ఉంటుంది. ఇవన్నీ భరించలేననుకున్న ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది.నగరంలోని మూసాపేటలో నివసిస్తున్న ఝాన్సీ అనే 25ఏళ్ల వయసున్న యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.

పెళ్లీడుకొచ్చిన ఝాన్సీకి వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కానీ ఝాన్సీ మాత్రం తనకు పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులకు ఖరాకండిగా చెప్పింది.దీనికి గల కారణం ఇరుగు పొరుగు ఇళ్లల్లో భార్యభర్తల మధ్య చోటుచేసుకుంటున్న కొట్లాటలు చూసి పెళ్లిపై విరక్తి, భయం పెంచుకుంది.

అయినా ఝాన్సీ కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లి సంబంధాలు చూడటం ఆపలేదు. దీంతో తనకు ఎక్కడ పెళ్లి చేస్తారోనని భయపడిన ఝాన్సీ ఉరేసుకుని చనిపోయింది. పెళ్లి చేసి పంపాలనుకున్న తల్లిదండ్రులు తమ కూతురు అలా చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.

Leave a Reply