మీ కలలో ఇలాంటివి వస్తే.. మీరు కోటీశ్వరులు అయినట్టే..!

కలలు కనడం మనిషి యొక్క సహజ లక్షణం.. జీవితంలో నెరవేర్చుకోలేని ఎన్నో కలల (Dreams) ను మనం కలలోనే సాకారం చేసుకుంటూ ఉంటాము . ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఒకే రకమైన కలలు రావాలి అన్న రూల్ ఏమి లేదు.. కొంతమందికి చెడ్డగా వస్తే.. మరికొంతమందికి మంచివిగా వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది వీటిని భ్రమలుగా కొట్టి పరేస్తూ ఉంటారు. వాస్తవానికి తెల్లవారుజామున వచ్చే కలలు మనకు నెరవేరుతాయి అని పెద్ద వాళ్ళు కూడా చెబుతున్న విషయం తెలిసిందే..

ప్రత్యేకించి తెల్లవారుజామున కలలో కొన్ని వస్తువులు కనిపించాయంటే.. త్వరలోనే డబ్బు మీ చేతికి అందుతుందని పండితులు కూడా చెబుతున్నారు.ఉదాహరణకు కలలో కనిపించేవన్నీ భ్రమ అనేది ఎంత నిజమో.. ఆ రకమైన హేతువును మన మెదడు ఊహిస్తోంది అనేది కూడా అంతే నిజం.. కానీ మనకు కలలు వస్తున్నాయంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయే వాటికి ఆనవాళ్లుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరి ముఖ్యంగా ఆస్ట్రాలజీ కూడా ఇలాంటివి చాలా గట్టిగా నమ్ముతుందని చెప్పవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా కలలో కొన్ని రకాల వస్తువులు కనిపించినట్లయితే తప్పకుండా అదృష్టవంతులు అవుతారట.ఉదయాన్నే కలలో ఉదయిస్తున్న సూర్యుడు లేదా పున్నమి చంద్రుడు కనిపిస్తే త్వరలో డబ్బు మీ చేతికి వస్తుందని అర్థం .. అలాగే తెల్లవారుజామున వచ్చే కలలో మనుషుల మలం కనిపిస్తే మరుసటి రోజు లేదా అదేరోజు నీ చేతికి డబ్బు అందుతుందని పండితులు చెబుతున్నారు.

అలాగే ఆవు పాలిస్తున్నట్టు, జుట్టూ రాలుతున్నట్టు, బంగారం ధరించినట్టు , పాయసం తింటున్నట్టు లేదా వండుతున్నట్టు, చక్కటి అద్దాలు కలలో కనిపించిన సరే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని గుర్తించాలి.వీటితోపాటు ఉదయాన్నే ఆవు గడ్డి మేస్తున్నట్టు కనిపిస్తే త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతోందని గ్రహించాలి. ఇక వీటితోపాటు ఉదయాన్నే రాజు, రాణి కలలో కనిపిస్తే ఆమె తల్లి కాబోతున్నట్టు సంకేతమట. అలాగే ఏదైనా మీకు అత్యంత ఇష్టకరమైన భగవంతుడు మీ కలలో కనిపించినట్లయితే ఆయన మీపై సదా తన ఆశీస్సులను ఉంచుతారని సమాచారం.

Leave a Reply