Bangkok Pilla: బిగ్ బాస్ హౌస్ లోకి బ్యాంకాక్ పిల్ల.. రెమ్యునరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..!

Bigg Boss : వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. కానీ సీజన్ 6 తరువాత వరల్డ్ వరస్ట్ రియాలిటీ షోగా మారింది. అంత దారుణంగా సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. సీజన్ 7 గురించి ఊసేలేకుండా పోయింది. అయితే ఈసారి పక్కా వ్యూహంతో సీజన్ 7‌ని Bigg Boss 7 Telugu ఎలాగైనా సక్సెస్ బాట పట్టించాలనే వ్యూహంలో ఉన్నారట నిర్వాహకులు. దానిలో భాగంగా ఈసారి మరికాస్త ఆలస్యం అయ్యేట్టు కనిపిస్తోంది. ఇకపోతే ఈసారి ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లో కిక్ ఇచ్చే చేంజెస్ జరగనున్నట్లు తెలుస్తోంది.

youtuber bangkok pilla

అయితే తాజాగా గ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే సెలబ్రిటీలు వీళ్లే అంటూ కొంతమంది పేర్లు బాగా ప్రచారం అవుతున్నాయి. ఇక ఆ కోవలోనే ఒక వ్యక్తి పేరు బాగా వినిపిస్తుంది. ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మందికి సుపరిచితురాలు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన రెండు మూడు నెలలలోనే తన గలగల మాటల ప్రవాహంతో ఒక మిలియన్ సుబ్క్రైబర్ని ఆకట్టుకోగలిగింది.

ఆమె ఇంకెవరో కాదు.. బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా థాయ్లాండ్ దేశంలోని వీధికొట్టు దగ్గర నుంచి వింత ప్రదేశాల వరకు అన్నింటినీ వీడియోలు చేసి జనాలకు చూపిస్తూ ఉంటుంది. ఆమె అసలు పేరు శ్రావణి సమంతపూడి ప్రస్తుతం బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ ఛానల్ కి రెండు మిలియన్లకు పైగా సబ్ స్కెబర్లు ఉన్నారు.

విజయనగరానికి చెందిన శ్రావణి బ్యాంకాక్లో కూడా తన యాసభాషలను వదిలిపెట్టలేదు. విదేశాల్లోనూ చక్కగా మన యాస మాట్లాడుతుండటంతో ఎంతోమంది ఈమె మాట్లాడే విధానానికి ఫిదా అయిపోయారు. ఈమె ఒక్క వీడియో పోస్ట్ చేసిందంటే క్షణాల్లో మిలియన్స్ అఫ్ వ్యూస్ దక్కించుకుంటుంది. ఈ వారంలో ఆమె పోస్ట్ చేసిన వీడియోలో మేము కుటుంబంతో సహా ఇండియాకు వచ్చేస్తున్నామంటూ వెల్లడించింది.

Leave a Reply