Harsha Sai – For You Telugu| హ‌ర్ష సాయికి అస‌లు అన్ని డ‌బ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!

హ‌ర్ష‌సాయి అనే పేరు ఇప్పుడు ఎక్క‌డ చూసినా మారుమ్రోగిపోతుంది. ఇక యూట్యూబ్ ఫాలో అయ్యే వారికి ఈ యూట్యూబ‌ర్ హ‌ర్ష సాయి గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. చిన్న వ‌య‌సులోనే ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. 23 ఏళ్ల వ‌య‌సులోనే హ‌ర్ష‌సాయి సోష‌ల్ మీడియాలో మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకుని ఓ రికార్డునే క్రియేట్ చేశాడ‌ని చెప్ప‌వ‌చ్చు.చిన్న వ‌య‌సులోనే ఇంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఎలా వ‌చ్చింది..? ఇత‌ను ఏం చేస్తాడు..? ఇంత గుర్తింపు ఇత‌నికి ఎలా వ‌చ్చిందంటే..

మ‌నోడు సాయం చేయ‌డంలో దాన‌క‌ర్ణుడు అనే చెప్ప‌వ‌చ్చు. చిన్న చిన్న గేమ్‌లు, డిఫ‌రెంట్ ఐడియాల‌తో ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు దానం చేసి మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్‌ని రాబ‌ట్టాడు. యూట్యూబ్‌లో ఫ‌న్నీ వీడియోలు, వంటలు, Vlogs వంటివి పెడుతుంటారు. హ‌ర్ష‌సాయి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. త‌న స‌బ్‌స్కైబ‌ర్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. వారి మ‌న‌సులో ఉండే చిన్న కోరిక‌లను తీర్చి స‌ర్‌ప్రైజ్ చేస్తుంటాడు. హ‌ర్ష‌సాయి వీడియోల‌లో ఎక్కువ శాతం ఇలాంటివే ఉండ‌డం విశేషం.

2018లో యూట్యూబ్‌లోకి అడుగు పెట్టిన హ‌ర్ష‌సాయి పేరు చెబితే ఇప్పుడు షేక్ అవుతోంది.ముఖ్యంగా త‌న ఫాలోవ‌ర్స్ కోసం ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ఫ్రీ పెట్రోల్‌గా పెట్రోల్ ఇవ్వ‌డం, చిన్న గుడిసెల‌లోకి వెళ్లి వాళ్లు జీవితంలో చూడ‌లేనంత డ‌బ్బుని చేతిలో పెట్టి వాళ్ల క‌ళ్ల‌లో ఆనందాన్ని చూడ‌డం.. రోడ్ల‌పైన చిన్న చిన్న ప‌నులు చేసే వారికి పెద్ద మొత్తంలో డ‌బ్బులు ఇవ్వ‌డం..

ఐదు రూపాయ‌ల కాయిన్స్‌తో కారు కొన‌డం.. ఇలా ల‌క్ష‌ల ఖ‌ర్చుతో వీడియోలు చేసి త‌నకు సంబంధించిన ‘Harsha Sai – For You Telugu’ ఛాన‌ల్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు.అత‌ని ఛాన‌ల్ కు 4 మిలియ‌న్ల‌కు పైగా స‌బ్‌స్క్రైబ‌ర్లున్నారు. అలా వీడియో అప్‌లోడ్ చేశాడో లేడో మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చిప‌డుతుంటాయి. మ‌రొక 3 ఛాన‌ల్స్ ద్వారా క‌లిపి నెలకు 3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంది. ఆ వ‌చ్చిన డ‌బ్బునే రొటేష‌న్ ప‌ద్ద‌తిలో ఖ‌ర్చు చేస్తుంటాడు.

హ‌ర్ష‌సాయి వీడియో చేసాడంటే.. మిలియ‌న్ల వ్యూస్ మాత్ర‌మే కాదు.. ల‌క్ష‌ల్లో ఖ‌ర్చ‌వుతుంది. అంత డ‌బ్బు అత‌నికి ఎక్క‌డిది..? త‌న పేరెంట్స్ అంత పెద్ద కోటిశ్వ‌రులా అంటే ఇంచు మించు అలాంటిదే అత‌ను కోటిశ్వ‌రుడే. హ‌ర్ష‌సాయి చేస్తున్న మంచి ప‌నుల‌కు మంచి పేరు వ‌స్తుండ‌డంతో వాళ్ల పేరెంట్స్ కూడా అడ్డు చెప్ప‌లేదు. ఇక హ‌ర్ష‌సాయి వాయిస్‌కి కూడా చాలా మంది అభిమానులే ఉన్నారు.

Leave a Reply