YS Jagan | నన్ను నా చెల్లిని విడదీయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.. జగన్..!

allroudadda

YS Jagan | ‘‘డర్టీ పాలిటిక్స్ కు పాల్పడటం కాంగ్రెస్ పార్టీ అలవాటు. తమ రాజకీయ లబ్ధికోసమే ఆంధ్రప్రదేశ్ ను అన్యాయంగా కాంగ్రెస్‌ పార్టీ విడదీసింది. కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసి నేను బయటకు వచ్చిన తరువాత… నా కుటుంబం నుండి మా బాబాయిని మంత్రిని చేసి నాపై పోటీకు దించింది ప్రయోగించింది. ఇప్పుడు మళ్లీ మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోంది అన్నారు జగన్..

నిజానికి బుధువారం తిరుపతి ఇండియా టుడే సమ్మిట్లో పాల్గొన్న ఆయన APCC చీఫ్ గా షర్మిలను నియమించడంపై స్పందించారు. ‘రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది. ఇప్పుడు మా కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర చేస్తోంది. నేను కాంగ్రెస్ కు రాజీనామా చేశాక మా చిన్నాన్నను మాకు వ్యతిరేకంగా పనిచేయించింది. విభజించి పాలించడం వాళ్ల నైజం. వీరికి దేవుడే గుణపాఠం చెబుతారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీలను 98% అమలు చేశాం..

allroudadda
allroudadda

ఎవరు ఎన్ని కుట్రలు చేసిన..ఎంతమంది కలిసి యుద్ధం చేసిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘ఇచ్చిన హామీలను 98% అమలు చేశాం. ఏపీలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు చోటు లేదు. మా పోటీ టీడీపీ, జనసేనతోనే ఉంటుంది. సర్వేల ఆధారంగానే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నాం. వ్యతిరేకత ఉండటంతో కొందరికి టికెట్లు ఇవ్వడం లేదు. ప్రజలు మావైపే ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు.

Leave a Reply