YS Sharmila | కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల..చిరుకి నాకు చాలా తేడా ఉంది..

allroudadda

YS Sharmila | వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె 2021లో తెలంగాణలో తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి, తమకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ నేతలు చెప్పడం అప్పట్లో సంచలనమైంది.. అలాగే ఓ టీవీ ఇంటర్వ్యూలో షర్మిల వైసీపీ నేతల మాటలు బాధించాయని కూడా తెలిపారు. ఇక ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో ఆమె, ఆమె పార్టీ పోటీ చేయలేదు. చివరికి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు.

ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్‌ఆర్‌ తన జీవితకాలం కష్టపడ్డారని చెప్పారు. ఆయన చివరిక్షణం వరకూ పార్టీకి సేవ చేశారని గుర్తుచేశారు. ఆయన కూతురుగా ఈ రోజు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈరోజు దేశంలోనే అతిపెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం..

allroudadda
allroudadda

YS Sharmila | ఇటీవల మణిపూర్ లో జరిగిన అల్లర్లు, ప్రాణనష్టం తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ తనతో పాటు దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. అందుకే తను కాంగ్రెస్ లో చేరానని,

బాబోయ్ రాశిఖన్నా మేకప్ లేకపోతే ఇలా ఉంటుందా

తన పార్టీ వైఎస్‌ఆర్‌టిపిని విలీనం చేశానని వివరించారు.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్‌ఆర్‌టిపి ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన తండ్రి వైఎస్‌ఆర్‌ కల అని, ఆ కలను నెరవేర్చడానికి కృషి చేస్తానని షర్మిల వివరించారు.

Leave a Reply