స్టార్ హీరోలకి వణుకు పుట్టిస్తున్న షర్మిల కొడుకు రాజారెడ్డి ఫిజిక్..!ఫిక్స్ వైరల్

YS Sharmila: నిన్న వైఎస్​ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట వద్ద ఆయన కుటుంబీకులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

ఇవాళ తెలంగాణలోని పాలేరులో నిర్వహించే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో షర్మిల పాల్గొననున్నారు. కాగా, తండ్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు చేరుకునే క్రమంలో షర్మిల ఎయిర్​పోర్ట్​లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో షర్మిలతో పాటు ఆమె కుమారుడు రాజారెడ్డి  Rajareddy కూడా ఉన్నారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్.. రాజారెడ్డి హీరోలా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. మహేష్​బాబు లాంటి టాలీవుడ్ హీరోను తలదన్నేలా ఆయన లుక్స్ ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. హైట్, ఫిజిక్, అందం.. ఏ విధంగా చూసుకున్నా రాజారెడ్డిది హీరో కటౌట్ అని అంటున్నారు. కాగా, వైఎస్ రాజారెడ్డి ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నారు.

Leave a Reply