TDP Janasena | అధికరంలోకి వచ్చక మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం.. బాబు

allroudadda

TDP Janasena | టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసిన సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నేడు యువగళం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. యువగళం నవశకం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభ కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ-జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దాంతో సభా ప్రాంగణం అంతా జనసంద్రాన్ని తలపిస్తోంది.

ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణ హాజరు అయ్యారు. 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యతలను తీసుకుంటామని.. అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటామని.. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకొస్తామని.. ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నామని ఇరువురు పార్టీ నేతలు ప్రకటించారు. త్వరలో టిడిపి, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు.

allroudadda
allroudadda

రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం..

అమరావతి, తిరుపతిలో నిర్వహించే బహిరంగ సభల్లో మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామనిప్రకటించారు.

Also Read | పాపం మరో వింత వ్యాధి ఈ బాలుడు నిద్రపోతే చనిపోతాడు…

రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500, తల్లికి వందనం కింద రూ. 15000 ఇవ్వనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పేదవారికి ఖర్చులు తగ్గించేందుకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని… రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ. 20000 సాయం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని విషయాలు చెబుతామని చెప్పుకొచ్చారు.

Leave a Reply