Aishwarya: ఆ హీరోతో రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్‌..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య Aaishwarya Rajinikanth ఫేమస్ కపుల్. అయితే వీరిద్దరూ తాజాగా విడిపోతున్నట్లు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఐశ్వర్య, ధనుష్ విడిపోతున్నట్లు వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 18ఏళ్ల పాటు కొనసాగిన తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు.హ్యాపీ న్యూస్‌తో వార్తల్లో ఉండటం కంటే… శాడ్ న్యూస్‌తో, అదీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో ఈ విధంగా వార్తల్లో ఉండటం బహుశా ఐశ్వర్యకు ఇది రెండోసారి ఏమో!

గతంలో ఓసారి శింబుతో ఆమె ప్రేమలో ఉన్నారంటూ చెన్నై కోడంబాక్క‌మ్ స‌ర్కిల్స్‌లో పుకార్లు షికార్లు చేశాయి. శింబు, ఐశ్వర్య ప్రేమ విషయం ర‌జ‌నీకాంత్‌కు తెలిసి డిజప్పాయింట్ అయ్యారని, కూతురుకు సంబంధాలు వెతకడం మొదలు పెట్టారని కూడా తమిళ జనాలు గుసగుసలాడుకున్నారు. కొన్ని రోజులకు ధనుష్, ఐశ్వర్య Aaishwarya Rajinikanth పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు.

అదీ సంగతి!ఐశ్వర్యతో మాత్రమే కాదు… చాలా మంది హీరోయిన్లతో శింబు ప్రేమ కలాపాలు సాగించాడని తమిళ సినిమా ఇండస్ట్రీ చెబుతోంది. అందులో నయనతార, హన్సికతో ప్రేమకథలు మీడియాకు తెలిసినవే. ఇక… శింబు లవర్స్ జాబితాలో ఒకప్పుడు త్రిష పేరు కూడా వినిపించింది. ఇప్పుడు నిధి అగర్వాల్ పేరు బలంగా వినబడుతోంది.

ఐశ్వర్య రజనీకాంత్‌ రెండోపెళ్లి..

తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ Aaishwarya Rajinikanth రెండోపెళ్లి చేసుకోబోతున్నారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ప్రస్థుతం ఆమె ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్‌గా ఉంటున్నారు. అంతే కాకుండా ఓ సినిమాకు డైరెక్షన్‌ కూడా చేస్తున్నారు. ఇలాంటి పుకార్లు రావడానికి ప్రధాన కారణం ఐశ్వర్యపై ఈమధ్య కోలీవుడ్‌కు చెందిన ఓ హీరోతో ఆమె కనిపించిందని తెలుస్తోంది.

చెన్నైలోని ఓ రిసార్ట్‌లో అతడితో ఆమె సన్నిహితంగా మెలుగుతూ కనిపించడంతో ఈ రెండో పెళ్లిపై పుకార్లు బలంగా వ్యాపిస్తున్నాయి. ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియదు. ఇదే విషయంపై ఐశ్వర్య రజనీకాంత్ స్పందిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లేదంటే ఇలాంటి పుకార్ల వల్ల ఇమేజ్‌ దెబ్బతింటుందని వారు తెలుపుతున్నారు.

Leave a Reply