Bathukamma | ప్రారంభమైన బతుకమ్మ.. 9 రోజులు నైవేద్యాలు ఇవే!

Bathukamma | పూల జాతరగా, ప్రకృతి వేడుకగా తెలంగాణ నేల జరుపుకొనే అతిపెద్ద పండుగ బతుకమ్మ.హైందవ సంప్రదాయంలో ప్రతి వేడుక వెనుకా ఒక కథ ఉంటుంది. ప్రతి సంబురానికీ ఒక సందర్భం ఉంటుంది. అలాగే బతుకమ్మ పుట్టుక వెనుకా చాలా గాథలు ఉన్నాయి. దాదాపు ప్రతి కథా ఒక స్త్రీ వ్యథ నుంచే పుట్టుకొచ్చింది. పూలను రాశిగా పేర్చి బతుకమ్మ ఆడే ఆచారం ఎప్పుడు పుట్టిందిఅన్నదానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, తెలంగాణ నేల మీద కనీసం పాతిక తరాలను చూసింది బతుకమ్మ.

ఎంగిలి పూల బతుకమ్మ:
మొదటి రోజు చేసే బతుకమ్మ కోసం నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ :
రెండో రోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ :
మూడో రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

నానే బియ్యం బతుకమ్మ :
నాలుగో రోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ :
ఐదో రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
అలిగిన బతుకమ్మ :
ఆరో రోజు ఆశ్వయుజ పంచమి.ఆనాడు ఎలాంటి నైవేద్యంమూ సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ :
ఏడో రోజు బియ్యం పిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ :
ఎనిమిదో రోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

సద్దుల బతుకమ్మ : చివరి రోజైన తొమ్మది రోజు ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం.తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

Leave a Reply