Doordarshan | ఒకప్పుడు దూరదర్శన్ న్యూస్ రీడర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి.

Doordarshan

Doordarshan | శాంతి స్వరూప్ ప్రభుత్వ ప్రచార సాధనమైనటువంటి దూరదర్శన్ లో తొలి తెలుగు యాంకర్. ముఖ్యంగా దూరదర్శన్ టీవీలో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఈయననే కావడం విశేషం. సీనియర్ సినీ ప్రముఖులతో కూడా ఈయనకు పరిచయం ఉంది. శాంతి స్వరూప్ కి సినిమాలతోపాటు రాజకీయాల్లో కూడా మంచి అనుభవం ఉంది. గతంలో ఓ టీవీ ఛానల్ కూడా ఇంటర్వ్యూ చేసింది.

ఆ సమయంలో ఆయన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మీకు బాగా గుర్తుండిపోయిన విషాదకరమైన వార్త ఏది..? సంతోషకరమైన వార్త ఏది అని ప్రశ్నించగా.. రెండు కూడా విషాద వార్తలే అని చెప్పారు. మొదటి విషాదకరమైన వార్త ప్రధాని ఇందిరాగాంధీ మరణం, ఇందిరాగాంధీ మరణించి పోయిందని నేను చాలా ఆశ్చర్యపోయాను. 16 బుల్లెట్లు ఆమె ఒంటికి తగిలాయి ఆమె మరణం ఒక సంచలనం అని చెప్పుకొచ్చారు.

కమెడియన్ యోగిబాబు ఒక్కరోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలిస్తే మైండ్ బ్లాక్..

రెండో వార్త ఏది అని అడగగా.. ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ మరణ వార్త చెప్పారు శాంతి స్వరూప్. ఇందిరాగాంధీ మరణం కంటే రాజీవ్ గాంధీ గారి మరణము చాలా దారుణమని.. మరణములో ఆయన శరీరము ముక్కలు ముక్కలూ అయిందని అందుకే ఆ వార్త ఇప్పటికీ నాకు వస్తుంది పోయిందని సీనియర్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకప్పుడు శాంతి స్వరూప్ ఇప్పుడు ఇలా మారాడు ఏమిటి అని పలువురు చర్చించుకోవడం విశేషం.

Leave a Reply