Varun Sandesh | చీర కట్టుకొని స్విమ్ చేయలేను కదా.. వరుణ్ సందేశ్ భార్య. వైరల్ కామెంట్స్,

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించిన హీరొలలో వరుణ్ సందేశ్ ( Varun sandesh )ఒకరు. జయాపజయాల సంగతి పక్కన పెడితే వరుణ్ సందేశ్ కు నటుడిగా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. పలు టీవీ షోలకు వితికా షేరు యాంకర్ గా కూడా వ్యవహరించి పాపులారిటీని సంపాదించుకున్నారు.

బిగ్ బాస్ షో ద్వారా వరుణ్ సందేశ్ వితికా షేరు జోడీ ఫేమస్ అయ్యారు. అయితే ఈ షో వల్ల తనపై ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో నెగిటివిటీ పెరిగిందని తర్వాత రోజుల్లో వితిక( Vithika sheru ) ఫీల్ కావడం జరిగింది. బిగ్ బాస్ షో వితికకు మైనస్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్ ని బాగా నే ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా వితిక వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది.ఈ క్రమంలోనే వాటర్ ఫాల్స్ దగ్గర టూ పీస్ బికినీతో దిగిన ఫొటోస్ అభిమానులతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఈ ఫొటోస్ చూసిన అభిమానులు కడుపు మండిపోయి వితికాను అడిగి మరీ కడిగేశారు. నువ్వు ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు.

నీపై ఉండే కొద్దీ గౌరవం కూడా తగ్గిపోతుంది. మరికొందరు నువ్వు పూర్తిగా బరితెగించేశావ్ వితికా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారని తెలుస్తుంది.అయితే వీటికి వితిక రిప్లై కూడా ఇచ్చింది. బట్టలు బట్టి ప్రేమ గౌరవం తగ్గుతుందా, చీర కట్టుకొని స్విమ్ చేయలేను కదా, స్విమ్ సూటే వేసుకోవాలి. అందుకే ఇలాంటి డ్రెస్ వేసుకున్నాను” అంటూ గట్టిగా రిప్లై ఇచ్చిందని తెలుస్తుంది.

Leave a Reply