Astro Tips: వాస్తు ప్రకారం ఈ వస్తువులను దానం చేయొద్దు.. చేస్తే కష్టాలు తప్పవు,

Tips: హిందూ ధర్మంలో దాన ధర్మానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దానం చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని విశ్వసిస్తారు. దానం చేయడం ముక్తి మార్గమని భావిస్తారు. ప్రజలు అనేక ప్రత్యేక సందర్భాలలో వస్తువులను దానం చేయడానికి కారణం ఇదే.

అయితే మత గ్రంధాల్లోన్ని వివరాల ప్రకారం.. సూర్యాస్తమం తరువాత కొన్ని వస్తువులను దానం చేయడం నిషిద్ధంగా పేర్కొంటారు. సూర్యాస్తమయం తరువాత వాటిని దానం చేయడం అశుభంగా పేర్కొంటారు. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. మరి సూర్యాస్తమయం తరువాత ఏ వస్తువులను దానం చేయకూడదో తెలుసుకుందాం..

డబ్బు దానం..

సూర్యాస్తమయం తర్వాత డబ్బు దానం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మత గ్రంధాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. అటువంటి సమయంలో డబ్బును దానం చేయడం ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుంది. అందుచేత సూర్యాస్తమయం తర్వాత ధనాన్ని దానం చేయకండి. ఉదయాన్నే దానం చేయడం ద్వారా ఎలాంటి సమస్యా ఉండదు.

పసుపును దానం చేయవద్దు..

పసుపును హిందూమతంలో అనేక శుభకార్యాలకు ఉపయోగిస్తారు. ఇది బృహస్పతి గ్రహం కారకంగా పరిగణించబడుతుంది. సూర్యాస్తమయం తర్వాత పసుపును ఎవరికీ దానం చేయకూడదు. ఇది బృహస్పతి గ్రహాన్ని బలహీనపరుస్తుందని మత గ్రంధాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

తులసి మొక్క..

సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను దానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసిని తాకడం కూడా నిషిద్ధం. ఈ సమయంలో తులసి చెట్టుకు నీరు కూడా పోయకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఈ మొక్కను దానం చేయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుందని విశ్వాసం. ఇది ప్రతికూల ఫలితాలనిస్తుంది. ఆర్థికపరమైన కష్టాలను కలిగిస్తుంది.

Leave a Reply