Undavalli Sridevi | సైకో పోవాలి.. బాబు రావాలి.. జగన్ పై ఉండవల్లి శ్రీదేవి పంచులు,

Undavalli Sridevi | టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. గుంటూరు టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఆమె..చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరిగ్గాలేదనన్నారు. చంద్రబాబును ఓ ఫ్యాక్షనిస్తులా అరెస్ట్ చేసి తరలించారని శ్రీదేవి ఆరోపించారు. ఇంత చేసినా చంద్రబాబు అదరకుండా.. బేదరకుండా కార్యకర్తల్లో ధైరం నింపే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూ స్థాపితం కావడం ఖాయమని.. వైసీసీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు.అలాగే సైకో పోవాలి.. బాబు రావాలి అంటూ జ‌గ‌న్‌పై ఆసక్తిక‌ర కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది. రీసెంట్‌గా అసెంబ్లీలో టీడీపీ సభ్యులతో కలిసి పోడియం ఎక్కి ఆందోళన చేశారు వైసీపీ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.

వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు పట్టారు.అలాగే త్వరలో చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.పులి ఒక అడుగు వెనక్కు వేస్తే బయపడినట్లు కాదు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం అవ్వటం ఖాయమని ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు.వచ్చే ఎన్నిక‌ల‌లో వైసీపీ భూస్థాపితం కావ‌డం ఖాయ‌మ‌ని, చంద్ర‌బాబు సీఎం కావ‌డం ప‌క్కా అంటూ ఆమె జోస్యం కూడా చెప్పారు.

Leave a Reply