Bholaa Shankar | భోళాశంకర్‌ టాక్‌ ఎలా ఉందంటే? రేటింగ్: ?/5

Bholashankar | దాదాపు పదేళ్ల తర్వాత మెహర్‌ రమేష్‌ మళ్లీ మెగా ఫోన్ పట్టి చిరుతో సినిమా తీస్తున్నాడంటే ఫ్యాన్స్‌ టెన్షన్‌ అంతా ఇంతా కాదు. దానికి కారణం కూడా లేకపోలేదు. మెహర్‌ రమేష్‌కు ఇప్పటివరకు తెలుగులో ఒక్క హిట్టు కూడా లేదు. హిట్టు సంగతి అటుంచితే.. అన్నీ అల్ట్రా డిజాస్టర్‌లే. కాస్తో కూస్తో ఆయన ఫిల్మోగ్రఫీలో చెప్పుకోదగినది బిల్లానే.ఇక షాడో తర్వాత పదేళ్లు గ్యాప్‌ తీసుకుని చిరుతో వేదాళం రీమేక్‌ను ఓకే చేయించుకున్నాడు.ఇప్పుడు భోలా శంకర్ ఎలా తీశాడో చూడండి.

కధ:(Bholashankar Movie Review)

మహిళల అక్రమ రవాణతో సినిమా ప్రారంభమౌతుంది. శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహా (కీర్తి సురేష్) చదువు కోసం కోల్‌కతాకు వస్తాడు. ఆమెను కాలేజీలో చేర్పించి జీవనోపాధి కోసం శంకర్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తాడు(Bholashankar Movie Review). మహిళల అక్రమ రవాణా నేరాలలో కలకత్తా పోలీసులు టాక్సీ డ్రైవర్ల సహాయాన్ని కోరడంతో.. వారికి శంకర్ ఒక కీలకమైన క్లూ ఇస్తాడు. అది అతనిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. మరోపక్క లాస్య (తమన్నా) సోదరుడు శ్రీఖర్ (సుశాంత్) మహా (కీర్తి)ని ప్రేమిస్తాడు.

Bholashankar Movie Review
Bholashankar Movie Review

వీరి పెళ్లికి శంకర్ కూడా ఆమోదించాడు. అయితే, లాస్యకు శంకర్ గతం గురించి తెలుస్తుంది. అతను చాలా హత్యలు చేశాడని మహాతో తన సోదరుడి వివాహాన్ని ఆపాలని నిర్ణయించుకుంది(Bholashankar Movie Review). ఈ క్రమంలో శంకర్ తన గతాన్ని, కోల్‌కతాకు రావడం వెనుక తన ఉద్దేశ్యాన్ని వివరిస్తాడు. మహిళల అక్రమ రవాణా చేస్తున్న క్రైమ్ నెట్‌వర్క్‌ కు శంకర్‌కు సంబంధం ఏంటి.? వారిని ఎలా అంతమొందిస్తాడు.? అతని ఫ్లాష్‌బ్యాక్ ఏంటి.? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటి నటుల పనితీరు (Bholashankar Movie Review)

చిరంజీవి (Chiranjeevi) నటన గురించి చెప్పడానికి ఏముంటుంది. ఆయనే అన్ని. ఇక సోదరి పాత్రలో కీర్తి సురేష్ పర్వాలేదు, ఆమెకు నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. తమన్నా తెరపై బబ్లీగా కనిపించింది. తన పాత్రకూడ పరిమితమే. ఇక డ్యాన్స్‌లతో రెచ్చిపోయిందిగత సినిమాలతో పోలిస్తే దర్శకుడు మెహార్ రమేష్ ఇందులో తన పనితనాన్ని చూపించారు. కాకపోతే కొన్ని సీన్లను కూడా మార్చితే బాగుండేది. ఓరల్ తనకున్న ఎక్స్‌పిరియన్స్‌తో సినిమాని అనుకున్న ఎమోషన్‌లో డ్రైవ్ చేయగలిగాడు. సినిమాలో రెండు పాటలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.

రేటింగ్: 2.7/5

Leave a Reply