రేపు చంద్రయాన్‌-3 ప్రయోగం.. సర్వత్ర ఉత్కంఠ.. ఎందుకంటే

2019లో ప్రయోగించిన చంద్రయాన్‌-2 చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ సమయంలో విఫలమయ్యింది.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యేందుకు ఇస్రో ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరికొన్ని గంటల్లో ఇస్రో బాహుబలి రోదసిలోకి వెళ్ళనున్న నేపథ్యంలో రాకెట్ కేంద్రం శ్రీహరికోటలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ప్రయోగానికి ముందు అమ్మణ్ణి గా భావించే సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరిని ఇస్రో చైర్మన్ సోమనాథ్ దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలంటూ అమ్మవారికీ పూజలు చేశారు.చంద్రయాన్- 3 రాకెట్ నమూనా చెంగాళమ్మ పాదాల చెంత ఉంచి ఆశీర్వాదం కోరారు.

శ్రీహరికోట నుంచి జరిగే చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో చైర్మన్ సోమనాధ్ అమ్మణ్ణికి పూజలు చేశారు. ఆయనకు ఆలయం దగ్గర EO ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి స్వాగతం పలికారు. చంద్రయాన్ -3 ప్రయోగం రేపు మధ్యాహ్నం 2గంటల 35 నిమిషాలకు జరుగుతోందని ఇస్రో చైర్మన్ సోమనాధ్ తెలిపారు.

నాల్గవ LVM 3 రాకెట్ ద్వారా చంద్రయాన్ ప్రయోగం జరుగుతుందన్నారు. ప్రతిష్టాత్మక ప్రయోగం అనంతరం నెలరోజులు పైగా చంద్రయాన్ – 3 ప్రయాణం చేస్తుందని, ఆగస్టు 23 తరువాత చంద్రయాన్ -3 చంద్రుని పై దిగుతుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కౌంట్ డౌన్.

Leave a Reply