Chiranjeevi | గ్రేట్ భోళా శంకర్ రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన చిరంజీవి… ఎన్ని కోట్లో తెలుసా..

Chiranjeevi | తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్‍గా భోళా శంకర్ తెరకెక్కింది. అయితే, మెగాస్టార్ చిరంజీవికి తగ్గట్టుగా మార్పులతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు మెహర్ రమేశ్. ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది.అయితే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో తెలుసు కదా. అలాంటి స్టార్ హీరో ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది.

అతడు నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ గా రికార్డులకు ఎక్కింది. వాల్తేరు వీరయ్య సక్సెస్ నేపథ్యంలో రూ. 65 కోట్లకు రెమ్యునరేషన్ పెంచిన చిరంజీవి, అనిల్ సుంకర వద్ద పైసాతో సహా తీసుకున్నాడని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. వాస్తవానికి చిరంజీవి కొంత మేర తన రెమ్యునరేషన్ వదిలేశాడని లేటెస్ట్ టాక్. భోళా శంకర్ విడుదలకు ముందే చిరంజీవి రెమ్యూనరేషన్ చెల్లించిన అనిల్ సుంకర రూ. 10 కోట్లకు మాత్రం చెక్ ఇచ్చాడట. దానిపై పోస్ట్ డేట్ వేశారట.

భోళా శంకర్ విడుదలైన రెండు మూడు రోజుల్లో చిరంజీవి ఆ పది కోట్ల చెక్ డ్రా చేసుకునేలా తేదీ వేశారట. ఇక భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకరకు రూ. 50 కోట్లకు పైగా నష్టం మిగిల్చిన నేపథ్యంలో అనిల్ సుంకర ఇచ్చిన రూ. 10 కోట్ల చెక్ చిరంజీవి ప్రజెంట్ చేయలేదట.

పది కోట్లు విత్ డ్రా చేసుకునే ఆలోచన లేని పక్షంలో ఆయన ఆ మొత్తం వదులుకున్నట్లే అన్నమాట వినిపిస్తుంది. భోళా శంకర్ వరల్డ్ వైడ్ రూ. 79 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు కేవలం రూ. 27 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం. దాదాపు భోళా శంకర్ రన్ ముగిసిన నేపథ్యంలో ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లింది.

Leave a Reply