Devotional | అన్ని దానాల కంటే అన్నదానం ఎందుకు ముఖ్యం..!మీరు తెలుసుకోండి,,

Devotional | అన్నదానం వల్ల కలిగే లాభాలను మనం తెలుసుకుందాం. మనం ఎన్ని దానాలు చేసినా ఎవ్వరికీ ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది. కావాలని ఒక్క అన్నదానంలో మాత్రమే దానం తీసుకున్నవారు ఇంక చాలు అని సంతృప్తి చెందుతారు. మిగిలిన ఏ దానం సంతృప్తిపరచక పోవచ్చు. కానీ, ఒక్క అన్నదానం మాత్రమే సంతృప్తిపరుస్తుంది. ఆహారం లేనిదే ఈ భూమిపై ఏ ప్రాణి జీవించలేదు.

మూడు పూటలా ఏ లోటు లేకుండా అన్నం దొరకడం అంటే సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి.భోజనం సమయంలో ఆ అమ్మను తలచుకొని మనస్ఫూర్తిగా ద్యానం చేసుకుని ఈ లోకంలో మనతో కలిసి జీవించే ప్రతి జీవికి ఏదో ఒక ఆహారాన్ని సమర్పించి, భోజనం చేసే వారికి అతిథి, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి అన్న ప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు చెబుతుంటారు.

అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైందని పండితులు చెబుతుంటారు. ఇదే విషయాన్ని మన పెద్దలు కూడా భావించి చేసేవారు కూడా. కర్నూలు జిల్లాలో ఓ శైవక్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుంది. త్రేతా యూగం ద్వాపర యూగంలో యజ్ఞయాగాలతో తపస్సులు మోక్షం పొందారు. అదే విధంగా కళియుగంలో దానధర్మాలు, దైవారాధన, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్షమార్గాన్ని దైవం ప్రసాదించారని పండితులు చెబుతారు. అన్నదానం ఎలాంటి స్వార్థం లేకుండా జలదానం, గోదానం వస్త్రదానం, కన్యాదానం విశిష్టమైంది.

Leave a Reply