Money tips | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వీటిని మరచిపోకండి..!

Lakshmi Kataksham | లక్ష్మీ దేవి కటాక్షం కలగాలంటే.. లవంగాలకు సంబంధించిన కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు పాటించాలని పరిహార శాస్త్రం చెబుతోంది. నవగ్రహాలలో శుక్రుడికి ప్రియమైనవి లవంగాలుగా చెబుతారు. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు.. అందుకని లవంగాలకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే.. శుక్రుడి బలం పెరుగుతుంది. దాంతో లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు. అందుకే.. అమావాస్య రోజున రాత్రిపూట 11 లవంగాలు లేదా 21 లవంగాలు కాల్చండి.

ఆ పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి. తద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు 2 లవంగాలు నోట్లో వేసుకొని నములుకుంటూ వెళ్ళండి. శుక్రుడి బలం వల్ల ఆ పనిలో ధన లాభం కలుగుతుంది. అలాగే, 2 లవంగాలు మీ జేబులో ఉంచుకొని పని మీద వెళ్లండి. శుక్రుడి బలం వల్ల ఆ పని సులభంగా పూర్తవుతుంది.

అలాగే, ఎప్పుడైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవనూనెతో దీపం పెట్టి 2 లవంగాల దీపంలో వేయండి. ఆంజనేయుడు విశేషమైన అనుగ్రహం ఇంకా పెరిగి మానసిక ధైర్యం కలుగుతుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. నరదృష్టి నుంచి బయటపడవచ్చు. శుక్రవారం పూట లక్ష్మీ పూజ చేసేటప్పుడు కూడా లవంగాలకు సంబంధించిన ఒక చిన్న విధివిధానం పాటించాలి.

నమ్మకంతో పాటిస్తే.. అద్భుత ఫలితాలు..  

ఆ విధివిధానమేంటంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించేటప్పుడు ఒక గులాబీ పువ్వు తీసుకొని దానిలో 2 లవంగాలు ఉంచాలి. ఆ గులాబీ లక్ష్మీదేవికి సమర్పించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాలు ప్రసాదంగా స్వీకరించండి.ఇలా గులాబీ పూలతో పాటు లవంగాలు ఉంచి లక్ష్మీ పూజ చేస్తే.. లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది.అలాగే, ఎప్పుడైనా సరే ఒక శుక్రవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో 5 లవంగాలు, 5 గవ్వలు ఉంచి మూటగట్టి ఆ మూట లక్ష్మీ పూజలో ఉంచండి.

పూజ పూర్తయిన తర్వాత ఆ మూటకి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసుకోవాలి. ఆ మూట మీ బీరువాలో దాచి పెట్టుకోండి. లవంగాలు గవ్వలు ఉన్నటువంటి మూట బీరువాలో ఉంటే అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. లవంగాల ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. తద్వారా శ్రీమహాలక్ష్మి దేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరు సులభంగా పాత్రులు కావచ్చు. శనివారం పూట లవంగాలు దానం ఇస్తే చాలా మంచిది. ఏదైనా పదార్థంలో లవంగాలు వేసి ఆ పదార్థం దానమిచ్చిన లేదా ఒక కేజీ లవంగాలను శనివారం రోజు దానం ఇచ్చిన మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి.

Leave a Reply