Goddess Lakshmi Devi | ఇలా చేస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు..!

Goddess Lakshmi Devi | ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రంతో పాటు జీవితంలోని పలు అంశాలపై చాలా మాట్లాడాడు. చాణక్యుడు ఆర్థిక, రాజకీయ, దౌత్య వేత్తగా పరిగణించబడ్డాడు. సంపద, శ్రేయస్సు కోసం ప్రజలు అనేక చర్యలు తీసుకుంటారు. దీని ద్వారా లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. గొప్ప ఆర్థికవేత్త చాణక్యుడి మాటలను మీరు పాటించినట్టయితే.. లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది. మీకు డబ్బుకు అస్సలు లోటు ఉండదు. కానీ మనం చేసి కొన్ని పనులు వల్ల లక్ష్మీ దేవి అక్కడ క్షణం ఉండదు..

ఒక్క క్షణం కూడా ఉండదు | Goddess Lakshmi Devi

మన ఇంట్లో లక్ష్మి కొలువుదీరడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ, చిన్న పొరపాటు చాలు అనంత లక్ష్మి అంతర్ధానమైపోతుంది. మనసులో అసూయ రగిలినా, లోభాన్ని ప్రదర్శించినా, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు గురైనా ఆ ఇంట లక్ష్మి ఉండదు.

ఇది చదవండి: తమన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

ధర్మం తప్పిన చోట, తులసిని పూజించని చోట, శివార్చన జరగని ఇంట, అతిథి సత్కారాలు లేని నెలవు నుంచి లక్ష్మి వెళ్లిపోతుంది. ఇల్లాలు కంటతడి పెట్టినా, అసత్యాలు పలికినా, దుర్భాషలాడినా, ఇతరుల మనసు గాయపరిచిన వారి ఇంటి నుంచి సిరి తరలిపోతుంది. భాగవతులను నిందించే వాళ్లపై కనికరం చూపదు లక్ష్మీదేవి. పొద్దస్తమానం నిద్రపోయే సోమరులను, పని చేయడంలో అశ్రద్ధ వహించే బద్ధకస్తులను కన్నెత్తి చూడదు. కలహాలు పెట్టుకునే ఇంట్లో క్షణం నిలువదు.

Leave a Reply