Ants | ప్రతి రోజు ఇంట్లో చీమలు కనిపించడం అదృష్టమా? దురదృష్టమా?

Ants | చీమల్లో ఎర్ర చీమలు, నల్ల చీమలు, గండు చీమలను చూస్తుంటాం. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మంచిదని చెబుతుంటారు. ఎర్ర చీమలు కనిపిస్తే అశుభమని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చీమలు మంచి చెడులను సూచిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. కార్యాలయంలో కానీ ఇంట్లో కానీ నల్ల చీమలు బయటకు వస్తున్నాయంటే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని సంకేతాలు తెలియజేస్తున్నాయి. కొత్త ఉద్యోగావకాశాలు, పదోన్నతులు వచ్చే ఆస్కారం ఉంటుంది.

నల్ల చీమలు విపరీతంగా వస్తుంటే మంచిదని సూచిస్తున్నారు. అయితే కుప్పలు కుప్పలుగా నల్ల చీమలు ఉండటం అంత మంచిది కాదు. కార్యాలయంలో కానీ ఇంట్లో కానీ ఎర్ర చీమలు కనిపిస్తే ప్రతికూలతలు ఎదురవుతాయి. ఇబ్బందులు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇంట్లో ఎర్ర చీమలు కనిపించకుండా ఉండటమే మంచిది. ఎర్రచీమలు అశుభానికి సంకేతంగా చెబుతారు.

పడక గదిలో నల్ల చీమలు కనిపిస్తే బంగారు వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.చీమలు ఉత్తరం వైపు నుంచి బయటకు వస్తే జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పడమర వైపు నుంచి చీమలు బయటకు వస్తే ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దక్షిణ దిశ నుంచి చీమలు బయటకు వస్తే డబ్బు వచ్చే వీలుంటుంది. తూర్పు దిశ నుంచి చీమలు బయటకు వస్తే మనకు అదృష్టం పట్టబోతోందని సంకేతం.

చీమల గురించి శకున శాస్త్రంలో ఎన్నో విషయాలు వివరించారు. ఇంట్లో డబ్బులు పుష్కలంగా ఉండాలంటే చీమలకు పరిహారం వేయాల్సిన అవసరం ఉంటుంది.శని, రాహువుల రూంలో చీమలు ఉంటాయని భావిస్తున్నారు. పిండిలో పంచదార కలిపి వేయడం వల్ల శని, రాహుల ప్రభావం తగ్గించుకోవచ్చు. ఉద్యోగం రాకుండా ఉండేవారు కొబ్బరికాయను రెండుగా చేసి అందులో నెయ్యి, చక్కెర నింపి చీమలకు పెడితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దీంతో చీమలకు ఆహారం వేయడం కూడా మనకు మంచే జరుగుతుందని చెబుతున్నారు.

Leave a Reply